https://oktelugu.com/

Mumbai Indians: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కథ ఇలా ముగిసింది

నిన్నటి వరకు ముంబైకి ప్లేఆఫ్‌ ఆశలు కొంతవరకు ఉండేవి. కానీ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో బుధవారం ఎస్‌ఆర్‌హెచ్, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌పై ముంబై ప్లేఆఫ్‌ ఆశలు ఆధారపడి ఉన్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 9, 2024 3:02 pm
    Mumbai Indians

    Mumbai Indians

    Follow us on

    Mumbai Indians: ఐపీఎల్‌–2024లో ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌ కథ ముగిసింది. సీజన్‌–18లో ఆ జట్టు ఏమాత్రం పోటీ కనబర్చలేదు. పేలవమైన ఆటతీరుతో పాయింట్ల పట్టికలో కింద నుంచి రెండోస్థానంలో నిలిచింది. గెలవాల్సిన మ్యాచ్‌లను చేజేతులా ఓడిపోయి.. ఇంటిబాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

    లక్నో ఓటమితో ముగిసిన ముంబై కథ..
    నిన్నటి వరకు ముంబైకి ప్లేఆఫ్‌ ఆశలు కొంతవరకు ఉండేవి. కానీ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో బుధవారం ఎస్‌ఆర్‌హెచ్, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌పై ముంబై ప్లేఆఫ్‌ ఆశలు ఆధారపడి ఉన్నాయి. లక్నో ఓడిపోతే.. ముంబై ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండేవి. కానీ ఆతిథ్య ఎస్‌ఆర్‌హెచ్‌ జట్లు ముంబై ఆశలను ఆవిరి చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్లు హెడ్, అభిషేక్‌ 166 పనుగుల లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా కేవలం 9.4 ఓవర్లలో ఛేదించి రికార్డు సృష్టించింది. ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేఆఫ్‌ స్థానం ఖరారు చేసుకోగా ముంబై ఆశలు ఆవిరయ్యాయి.

    ఆరు స్థానాల్లో ఉంటేనే ఛాన్స్‌..
    ఐపీఎల్‌ సీజన్‌ –18 ఇప్పటి వరకు అన్ని జట్లు 12 లీగ్‌ మ్యాచ్‌లు ఆడాయి. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దీంతో మొదటి ఆరు స్థానాల్లో ఉన్న జట్లకే ప్లేఆఫ్‌కు చేరే అవకాశం ఉంటుంది. పాయింట్ల పట్టికలోని మొదటి నాలుగు జట్లు ప్లేఆఫ్‌కు చేరుతాయి. ప్రస్తుతం కోల్‌కతా 16 పాయింట్లతో మొదటిస్థానంలో ఉండగా, 16 పాయింట్లతోనే రాజస్థాన్‌ రెండో స్థానంలో ఉంది. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ మూడు జట్లు ప్లేఆఫ్‌కు చేరడం దాదాఫు ఖాయం.

    మిగతా మూడు సాథనాల్లో..
    ఇక పాయింట్ల పట్టికలో 4, 5, 6 స్థానాల్లో చెన్నై, ఢిల్లీ, లక్నో జట్లు ఉన్నాయి. చెన్నై, ఢిల్లీ, లక్నో సమాన పాయింట్లు 12తో 4, 5, 6 స్థానాల్లో ఉన్నాయి. రన్‌రేట్‌లో స్వల్ప తేడాలు ఉన్నాయి. ఇక పది జట్లలో ముంబై, గుజరాత్, బెంగళూరు, పంజాబ్‌ జట్లకు ప్లేఆఫ్‌ ఆశలు దాదాపు లేనట్లే. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, ముంబై 12 మ్యాచ్‌లు ఆడాయి. మిగతా ఆరు జట్లు 11 మ్యాచ్‌లు ఆడాయి. 11 మ్యాచ్‌లు ఆడిన జట్లకు మరో మూడు మ్యాచ్‌లు ఉండగా, 12 మ్యాచ్‌లు ఆడిన జట్లకు ఇంకా రెండు లీగ్‌ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.