MS Dhoni : సామాన్యులు మాత్రమే కాదు, పేరుపొందిన క్రికెటర్లు కూడా హైదరాబాద్ బిర్యానీని ఆవురావుమంటూ తినేస్తారు.. కేవలం చికెన్ మాత్రమే కాకుండా మటన్, ఫిష్, ఫ్రాన్స్ బిర్యానీ కూడా వదలకుండా తినేస్తారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఎంత పెట్టినా తినేంత ఇష్టం. అందువల్లే హైదరాబాద్ వస్తే చాలు మహేంద్ర సింగ్ ధోని ముందుగా చూసేది హైదరాబాద్ బిర్యానీనే. అందులో రకరకాలను ధోని తినేస్తాడు. ముఖ్యంగా హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యాని అంటే ధోనికి విపరీతమైన ఇష్టం. అయితే తన ఇష్టాన్ని కాదన్నారని ఒక హోటల్ యాజమాన్యంపై ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు తన కోపాన్ని మరో విధంగా హోటల్ యాజమాన్యానికి తెలిసేలా చేశాడు.
Also Read : ధోనికి ప్రతినెల బీసీసీఐ ఎంత పెన్షన్ ఇస్తుందో తెలుసా?
ఆసక్తికర విషయాలు పంచుకున్న రాయుడు
తెలుగు క్రికెటర్ రాయుడు ఓ తెలుగు యూట్యూబర్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ముఖ్యంగా బిర్యానీ కోసం ధోని హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విధానం.. చివరికి ఆ హోటల్ నే మార్చిన తీరును రాయుడు వెల్లడించాడు. 2014లో ఐపీఎల్ సీజన్ లో రాయుడు ముంబై జట్టుకు ఆడుతున్నాడు. అప్పుడు ఐపీఎల్ మ్యాచ్ కోసం చెన్నై ఆటగాళ్లు హైదరాబాద్ వచ్చారు.. అప్పుడు ధోని, సురేష్ రైనా.. ఇతర ప్లేయర్లు అంబటి రాయుడిని బిర్యానీ పంపించాలని కోరారు. దీంతో రాయుడు తన ఇంట్లో బిర్యానీ వండించి ధోని, సురేష్ రైనా, ఇతర ప్లేయర్లు ఉన్న హోటల్ కు పంపించాడు . బయట వండిన ఆహారానికి అనుమతి లేదని హోటల్ నిర్వాహకులు చెప్పారు. అంబటి రాయుడు ఇంట్లో వండిన బిర్యానిని వెనక్కి పంపించారు. దీంతో ధోని ఆగ్రహాన్ని గురై ఆ హోటల్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. హఠాత్తుగా వేరే హోటల్ లోకి మారిపోయాడు. ఇక అప్పటినుంచి ఆ హోటల్లో చెన్నై ఆటగాళ్లు, టీమిండి ఆటగాళ్లు బస చేయడం లేదు. ధోని మైదానంలో చాలా కూల్ గా ఉంటాడు. పెద్దగా తన ఆగ్రహాన్ని బయటకు వ్యక్తం చేయడు. కానీ కొన్ని విషయాలలో ధోని స్పష్టమైన వైఖరితో ఉంటాడు. మొండిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక ధోని తదుపరి హైదరాబాద్ కు వచ్చినప్పుడు రాయుడు ఇంట్లో బిర్యానీ వండించుకుని తిన్నాడు. పలు సందర్భాల్లో రాయుడు ఇంట్లో బస చేశాడు. ఇక ప్రస్తుతం క్రికెట్ పిఆర్ వల్ల ఆట నాశనం అవుతుందని.. సామర్థ్యం ఉన్న ఆటగాళ్లకు అవకాశం లభించడం లేదని రాయుడు చెప్పారు. పి ఆర్ వ్యవస్థను క్రికెట్లోకి తీసుకురావడం వల్ల ఆటస్వరూపం పూర్తిగా మారిపోయిందని.. సామర్థ్యాన్ని ఆటగాళ్ల గురించి గొప్పగా చెప్పాల్సి వస్తున్నదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read : మనుషుల్లో అది లోపిస్తోంది. అలాంటివి నిత్యం జరుగుతున్నాయి: ధోని భావోద్వేగం..