https://oktelugu.com/

MS Dhoni: తొలిసారి పాట పాడిన ఎంఎస్ ధోని.. వైరల్ వీడియో…

రీసెంట్ గా లవ్ గురు స్టైల్లో గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో కుర్రాళ్ళు ఇలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అనే విధంగా తనదైన రీతిలో సలహాలను ఇచ్చాడు.ఇక అందులో భాగంగానే 'మై పల్ దో పల్ కా షాయర్ హు' అనే పాట పాడి అందర్నీ విపరీతంగా అలరించాడు.

Written By:
  • Gopi
  • , Updated On : October 31, 2023 / 09:13 AM IST
    Follow us on

    MS Dhoni: ప్రపంచ క్రికెట్ చరిత్రలో ధోని ఒక అద్భుతమైన కెప్టెన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈయన ఐసీసీ నిర్వహించే అన్ని ట్రోఫీ లను అందించి ఇండియన్ టీం ని నెంబర్ వన్ పొజిషన్ లో నిలిపాడు. అంతేకాకుండా ఆయన వల్లే ఇండియన్ క్రికెట్ టీం ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా నిలిచింది.ఒక ధోని వల్లే ఇండియన్ టీం అంటే ప్రపంచ దేశాలకు కూడా చాలా ఇష్టంగా ఏర్పడింది.ఇక క్రికెట్ కి ధోని గుడ్ బై చెప్పేసి చాలా సంవత్సరాలు అవుతుంది.తన ఫ్యాన్స్ ఆయన ఆటని చాలా సంవత్సరాల నుంచి మిస్ అవుతున్నారు.ఐపీఎల్ లో ఆయన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున క్రికెట్ ఆడుతున్ పరుగులు చేస్తు గ్రౌండ్ లో కుర్రలతో పోటి పడుతూ 41 వయసులో కూడా తనదైన రీతిలో మ్యాచులు ఆడుతూ బ్యాటింగ్ చేస్తూ రన్నింగ్ చేస్తూ ఇప్పటి యంగ్ స్టార్స్ కి కూడా అతను పోటీ ఇస్తున్నాడు.

    ఇలాంటి క్రమంలో ధోని ప్రస్తుతం పలు రకాల ఈవెంట్లలో కూడా పాల్గొంటున్నారు… అలాగే రీసెంట్ గా లవ్ గురు స్టైల్లో గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో కుర్రాళ్ళు ఇలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అనే విధంగా తనదైన రీతిలో సలహాలను ఇచ్చాడు.ఇక అందులో భాగంగానే ‘మై పల్ దో పల్ కా షాయర్ హు’ అనే పాట పాడి అందర్నీ విపరీతంగా అలరించాడు…ధోని ఇప్పుడు అనే కాదు ఇంతకుముందు కూడా ఇదే పాటని ఎప్పుడు పాడుతూ ఉండేవాడు ఇలా ధోని క్రికెట్ ఆడకపోయిన ఇంట్లో కనిపిస్తూ సందడి చేస్తూ తన ఫ్యాన్స్ ని హుషారు చేస్తున్నాడు.ఈ సందర్భంలోనే ప్రస్తుతం ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతుంది అందులో అదరగొడుతోంది.

    కాబట్టి ఇండియన్ టీం కి బెస్ట్ విషెస్ ని కూడా తెలియజేశాడు.అలాగే దాంతోపాటు ఈసారి ఇండియా వరల్డ్ కప్ కొడుతుంది అనే ఆశ భావాన్ని కూడా వ్యక్తం చేసి ఇండియన్ అభిమానుల్లో మంచి జోష్ నింపాడు. ఒకప్పుడు ధోని తనదైన మార్క్ ఇన్నింగ్స్ ఆడుతూ ఫినిషిర్ గా అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు.ధోనీ బ్యాటింగ్ లో ఉన్నాడంటే ప్రపంచంలో ది బెస్ట్ అండ్ నెంబర్ వన్ బౌలర్ అయిన కూడా బౌలింగ్ చేయడానికి భయపడేవారు అంత పేరు ప్రఖ్యాతలు సాధించిన ధోని ప్రస్తుతం క్రికెట్ నుంచి రిలాక్స్ అవుతూ సినిమాలను ప్రొడ్యూస్ చేసే పనిలో ఉన్నాడు