Renu Desai: వరుణ్‌తేజ్-లావణ్య పెళ్లికి వెళ్లకపోవడం పై బరెస్ట్ అయిన రేణుదేశాయ్

పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా మూడు రోజుల క్రితమే ఇటలీకి వెళ్లారు. కాగా పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ పెళ్లికి వెళతారా లేదా? అనే సందేహాలు ఉన్నాయి. సాధారణంగా ఈ అనుమానం రాదు.

Written By: NARESH, Updated On : October 31, 2023 9:08 am

Renu Desai

Follow us on

Renu Desai: రేపే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహం. ఈ పెళ్లి ఇటలీ దేశంలో జరుగుతున్న విషయం తెలిసిందే. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసిన నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా అక్కడకు వెళ్లారు. ఉపాసన పేరెంట్స్ అయిన కామినేని ఫ్యామిలీ కూడా ఈ వివాహానికి హాజరైనట్లు సమాచారం. దాదాపు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరుకానున్నారు.

కాగా పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా మూడు రోజుల క్రితమే ఇటలీకి వెళ్లారు. కాగా పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ పెళ్లికి వెళతారా లేదా? అనే సందేహాలు ఉన్నాయి. సాధారణంగా ఈ అనుమానం రాదు. కానీ కొన్నాళ్లుగా రేణూ దేశాయ్ హైదరాబాద్ లో ఉంటుంది. మెగా ఫ్యామిలీతో ఆమె తత్సంబంధాలు మైంటైన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె పెళ్ళికి హాజరయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం అనే వాదన ఉంది.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణూ దేశాయ్ ని మీరు వరుణ్ తేజ్-లావణ్య పెళ్ళికి వెళుతున్నారా? అని అడగడం జరిగింది. ఈ ప్రశ్నకు రేణూ దేశాయ్ ఆసక్తికర సమాధానం చెప్పింది. నేను నిహారిక పెళ్ళికి కూడా వెళ్ళలేదు. పిల్లల్ని మాత్రమే పంపాను. వరుణ్ తేజ్ పెళ్లికి నేను వెళ్లడం లేదు. నేను పెళ్ళికి వెళితే అందరూ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వరుణ్ నాకు 8 ఏళ్ల వయసు నుండి తెలుసు. అతనికి నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి… అని అన్నారు.

మెగా ఫ్యామిలీ పెళ్లి వేడుకకు నేను హాజరైతే వాళ్ళు ఇబ్బంది పడతారని రేణూ దేశాయ్ ఓపెన్ గా చెప్పింది. ఇదిలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత రేణూ దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంలో ఆమె ఓ సోషలిస్ట్ రోల్ చేసింది. ఇకపై ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు.