MS Dhoni: ఏజ్ పెరిగేకొద్దీ ధోని ఆట లో పదును పెరుగుతుందా..?

ఇలాంటి క్రమంలోనే ఒక మ్యాచ్ లో ధోని ఉన్నాడు అంటే ప్రత్యర్థి ప్లేయర్ల గుండెల్లో వణుకు పుడుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Written By: Gopi, Updated On : March 23, 2024 10:53 am

MS Dhoni runs out Anuj Rawat

Follow us on

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్(CSK) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్ తో ఐపిఎల్ సీజన్ 17 ఘనంగా ప్రారంభం అయింది. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై టీమ్ బెంగుళూరు ను చిత్తు చేసి మొదటి విక్టరీ ని సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో 173 పరుగులు చేసిన బెంగళూరు టీమ్ ను చిత్తు చేస్తూ చెన్నై 176 పరుగులు చేయడం విశేషం…ఇక ఇది ఇలా ఉంటే ధోని గ్రౌండ్ లో ఒక చిరుత పులి లా కదులుతాడు. బంతి ఏ దిక్కున వెలుతున్న దూకి మరి పట్టుకోవడంలో ధోని ని మించిన వారు మరొకరు లేరు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఒక మ్యాచ్ లో ధోని ఉన్నాడు అంటే ప్రత్యర్థి ప్లేయర్ల గుండెల్లో వణుకు పుడుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక వ్యూహాలకి పదును పెడుతూ, ప్లేయర్ల యొక్క మైండ్ సెట్ తో ఆడుకునే ఏకైక ప్లేయర్ ధోని… ఈ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ఒక్కరోజు ముందు ధోని కెప్టెన్ గా తప్పుకుంటున్నట్టుగా ప్రకటించడం చెన్నై టీమ్ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కొంతవరకు ఆందోళనను కలిగించింది. ఇక ఋతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ టీం అద్భుతమైన ప్రదర్శనను కనబరచడం గైక్వాడ్ కెప్టెన్సీకి బలాన్ని చేకూర్చింది.

ధోని అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చడంలో గైక్వాడ్ 100% సక్సెస్ అయ్యాడు… ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో కీలకమైన ప్లేయర్లను అవుట్ చేయడంలో ధోని చాలా కీలక పాత్ర వహించాడనే చెప్పాలి. ‘ముస్తిఫిజార్ రహమాన్’ వేసిన బంతిని సరిగ్గా అంచనా వేయలేని రజత్ పట్టిదర్ బ్యాట్ తో డిఫెన్స్ చేయాలని చూశాడు. కానీ అది బ్యాట్ కి తగిలి వికెట్ల వెనకాల ఉన్న ధోని చేతికి చిక్కింది. అలాంటి క్యాచ్ లను పట్టుకోవడంలో ధోని ని మించిన వారు మరొకరు లేరు. కాబట్టి దాన్ని మిస్ చేయకుండా పట్టుకున్నాడు. ఇక అలాగే దీపక్ చాహర్ బౌలింగ్ లో డేంజరస్ బ్యాట్స్మెన్ అయిన ‘గ్లేన్ మాక్స్ వెల్’ ను అవుట్ చేయడంలో కూడా ధోని కీలకపాత్ర వహించాడు. మాక్స్వెల్ బ్యాట్ కి తగిలిన బంతిని ధోని అటుగా వెళుతున్న కూడా కొంచెం రిస్క్ చేసి పట్టుకున్నాడు. ఇక మొత్తానికైతే ధోని ఇద్దరు డేంజరస్ బ్యాట్స్మెన్స్ ను అవుట్ చేయడంలో కీలకపాత్ర వహించాడు. ఇక అలాగే ఇన్నింగ్స్ చివరి బంతికి అనుజ్ రావత్ ఒక పరుగు తీయాలని చేసిన ప్రయత్నం మీద ధోని నీళ్ళు చల్లాడు.

దినేష్ కార్తీక్ ఇద్దరు కలిసి పరుగెత్తుతుంటే వికెట్ల వెనకాల ఉన్నది ధోని కాబట్టి బాల్ ను వికెట్లకు కొట్టి ఎంపైర్ వైపు చూడగానే థర్డ్ ఎంపైర్ దాన్ని ఔట్ గా తేల్చాడు. ఇక మొత్తానికైతే అత్యధిక రన్ ఔట్లు చేసిన ప్లేయర్ గా కూడా ధోని ఒక రికార్డు ను సృష్టించాడు. ఇక ఇంతకుముందు ధోని జడేజా ఇద్దరు 23 రన్ ఔట్లు చేసి సమానమైన ప్లేస్ లో ఉండేవారు. కానీ ఈ మ్యాచ్ లో చేసిన రన్ ఔట్ తో ధోని జడేజా ను బీట్ చేసి మరీ 24 రన్ అవుట్లు చేసిన ప్లేయర్ గా కూడా గుర్తింపు సంపాదించుకోవడం విశేషం…