https://oktelugu.com/

CM Ramesh: కాంగ్రెస్ తోనూ చంద్రబాబు దోస్తీ.. రూ.30 కోట్లు ట్రాన్స్ ఫర్?

వాస్తవానికి ఎన్నికల సమయంలో ఇలాంటివి సర్వసాధారణమైనప్పటికీ.. పైగా ఏపీలో ఇవి మామూలే అయినప్పటికీ.. జగన్ అనుకూల మీడియా రాసిన కథనంలో ఎక్కడో లాజిక్ మిస్ అవుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : March 23, 2024 / 10:49 AM IST

    CM Ramesh

    Follow us on

    CM Ramesh: ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అసలు సిసలైన రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంటే.. ప్రతిపక్షం అధికార పక్షంపై ధ్వజమెత్తుతోంది. ఈ రెండు పక్షాలకు బలమైన మీడియా సంస్థలు ఉండటంతో ఒకరిపై ఒకరు లీటర్ల కొద్దీ బురదను చల్లుకుంటున్నారు. తాజాగా జగన్ అనుకూల మీడియాలో శనివారం ఒక కథనం ప్రచురితమైంది..”కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేష్ 30 కోట్లు.. దేశముదుర్లు” అనే శీర్షికతో స్ట్రిప్పర్ బ్యానర్ కథనం ప్రచురితమైంది.” తను చెప్పినట్టు ఆడాలని కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు ప్యాకేజీ పంపాడు. కేసుల కోసం బిజెపితో అంట కాగాడు. కాపుల కోసం జనసేనతో పొత్తు కుదుర్చుకున్నాడు. 2019లో ఓడిన వెంటనే సీఎం రమేష్ ను చంద్రబాబు బిజెపిలోకి పంపాడు. అతని ద్వారానే 2023లో కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు నిధులు ఇచ్చాడు. ఆ నిధులు అందిన తర్వాతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేశారు. ఆ తర్వాత ఏపీ పీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు. అక్కడి నుంచి ఆమె జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టారు. ఇప్పుడు కడపలో పోటీ కూడా అందులో భాగమే. ప్రశాంత్ కిషోర్, షర్మిల, పవన్ కళ్యాణ్, చంద్రబాబు బ్యాచ్ మొత్తానికి సీఎం రమేష్ ప్రత్యేక విమానాన్ని సమకూర్చారు.. ఇన్ని కుట్రలతో నారా చంద్రబాబు నాయుడు తన రికార్డులను తన బద్దలు కొట్టుకుంటున్నాడని” జగన్ అనుకూల మీడియా రాస్కొచ్చింది..

    వాస్తవానికి ఎన్నికల సమయంలో ఇలాంటివి సర్వసాధారణమైనప్పటికీ.. పైగా ఏపీలో ఇవి మామూలే అయినప్పటికీ.. జగన్ అనుకూల మీడియా రాసిన కథనంలో ఎక్కడో లాజిక్ మిస్ అవుతోంది. ఒకవేళ సీఎం రమేష్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు పంపితే.. బిజెపి ఎలా ఊరుకుంటుంది? ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు కదా? పైగా ఏపీలో కాంగ్రెస్ కేడర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి పంచన చేరింది కదా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు కదా? అలాంటప్పుడు చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపాల్సిన అవసరం ఏంటి? 2019లో దేశం మొత్తం ఏకం చేస్తానని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి, ఇతర ప్రతిపక్షాలకు నగదు సాయం చేశాడని ఆరోపణలు వినిపించాయి. అందులో నిజం ఎంతో? అబద్ధం ఎంతో తెలియదు. ఆ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ తర్వాత చంద్రబాబుకు తత్వం బోధపడింది. ఆ తర్వాత కొంతకాలం వరకు ఆయన మౌనాన్ని ఆశ్రయించారు. జగన్ తొక్కిన తొక్కుడుకు దెబ్బకు మళ్ళీ మోదీ గుర్తుకొచ్చాడు. ఆయన పంచన చేరడానికి చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలే చేశాడు. చివరికి ఎలాగోలా ఎన్డీఏ ఫోల్డ్ లోకి వెళ్ళాడు. ఇదే సమయంలో స్కిల్ స్కామ్ కేసులో ఏపీ ప్రభుత్వం చంద్రబాబునాయుడిని అరెస్టు చేసింది. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ జగన్ ప్రభుత్వం చేసిన దాన్ని విమర్శించలేదు. అలాంటప్పుడు సీఎం రమేష్ ద్వారా 30 కోట్లు పంపించాల్సిన అవసరం ఏంటి.

    ఒకవేళ జగన్ అనుకూల మీడియా రాసిన దాని ప్రకారం.. చంద్రబాబు కాంగ్రెస్ తో చేరడానికి తెరవెనుక ప్రయత్నాలు చేశారనుకుందాం.. ఈ రోజుల్లో ఏ రాజకీయ పార్టీ సొక్కం కనుక.. జగన్ మాత్రం తక్కువ తిన్నాడా? ఆయన కూడా ఈ ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనలేదు కదా. పైగా కేంద్రం ప్రవేశపెట్టిన కీలక బిల్లులకు మద్దతు కూడా ఇచ్చాడు కదా.. అలాంటప్పుడు జగన్ ఏ ఉద్దేశంతో కేంద్రానికి వంత పాడాడు? సీఎం రమేష్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కాదు కదా? అతడు ఒక బిజినెస్ మాన్. పైగా అతడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి ఎంపీ కాలేదు. పెద్దలకోటాలో రాజ్యసభ సభ్యుడు అయ్యాడు. పెద్దలకోటాలో రాజ్యసభ సభ్యత్వం అంటే అది ఎలా వస్తుందో అందరికీ తెలుసు. దాన్ని కొనుక్కున్న వ్యక్తి.. ఒక రాజకీయ పార్టీకి 30 కోట్లు ఇవ్వలేడా..

    జగన్ అనుకూల మీడియా ఇంతటి కథనం రాసినప్పుడు ముందుగా కొన్ని విషయాలపై ఫోకస్ చేస్తే బాగుండేది.. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీలకు ఎలా డబ్బులు పంపించాడు?(ఇవి అప్పట్లో జగన్ అనుకూల మీడియా చేసిన ఆరోపణలు) ఏ రూపంలో ఆ నగదు పంపిణీ అయింది? ఎవరెవరికి అందింది? దానికి తెర వెనుక ఎవరు సూత్రధారులుగా ఉన్నారు.. అప్పట్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ఎలా ఒప్పందం కుదుర్చుకున్నాడు? ఈ విషయాలపై స్థూలంగా ఒక పరిశోధనాత్మక కథనం రాస్తే ఎన్నికల్లో చంద్రబాబు రూపం బయటపడేది. జగన్ అనుకున్న మీడియాకు ఇంతటి ప్రయాస తప్పేది. జగన్ అనుకూల మీడియా అందరూ అంటుంటారు కానీ.. ఆ మీడియా అంతటి బలం ఇస్తే జగన్ సిద్ధం సభలో.. నాకు ఏం మీడియా సపోర్ట్ లేదని ఎందుకంటాడు..పూర్ రిపోర్టింగ్.. పూర్ ప్రజెంటేషన్..