Telangana Lok Sabha Elections : కవిత అరెస్టుతో మారుతున్న తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రం

‘కవిత అరెస్టుతో మారుతున్న తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రం’పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు. 

Written By: NARESH, Updated On : March 23, 2024 11:27 am

Telangana Lok Sabha Elections : తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ఇప్పటిదాకా అభ్యర్థుల ప్రకటన లేదు కాబట్టి స్పష్టత లేదు. ఇప్పుడు దీంట్లో అభ్యర్థుల ప్రకటనలో అత్యధిక స్థానాలు పోటీకి ప్రకటించి బీజేపీ ముందుంది. అది వారికి యాడెడ్ అడ్వంటేజ్ అయ్యింది.

దాంతోపాటు కవిత అరెస్ట్ తో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కాంగ్రెస్ లో అభ్యర్థులను ప్రకటించలేక అధికారంలో ఉండి మల్లగుల్లాలు పడుతోంది. కాంగ్రెస్ పరిస్థితి ఊహించిందే..

కాంగ్రెస్ రెండో జాబితాను తెలంగాణలో రిలీజ్ చేసింది. రెండో జాబితా చూస్తే ఎలా ఉందని అడిగితే ఎవ్వరూ బలమైన నేతలు కాదని అంటున్నారు. నిన్నగాక మొన్న కాంగ్రెస్ లో చేరిన సునీత మహేందర్ రెడ్డిని మల్కాజిగిరి నుంచి పోటీలో నిలపడం కరెక్ట్ కాదని అంటున్నారు. పట్టణ ప్రజలను ఆకట్టుకునే అభ్యర్థి ఈమె కాదని అంటున్నారు. ఈటలపై పోటీగా సునీతను నిలబెట్టడం ఏమాత్రం పోటీ ఉండదని అనిపిస్తోంది.

ఇక సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ ను నిలిపారు. దానంపై సికింద్రాబాద్ పట్టణ ప్రజలకు సదాభిప్రాయం ఉంటుదని మేం అనుకోవడం లేదు. చేవెళ్లలో బీజేపీ తరుఫున కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పేరుంది. ఆయనకు పోటీగా రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ తరుఫున నిలిపారు.

కాంగ్రెస్ నుంచి నిలబడ్డ ముగ్గురు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే కావడం కాంగ్రెస్ చేతకాని.. అసహాయ దుస్థితికి నిదర్శనం. ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తేలిపోయారని తెలుస్తోంది. డబ్బులున్న వారిని కాంగ్రెస్ ఎంపిక చేసుకుంది.

‘కవిత అరెస్టుతో మారుతున్న తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రం’పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.