Car Safety Tips : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఏసీలు, కూలర్లు పెట్టుకుని మనల్ని మనం చల్లగా ఉంచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాం కదా. మరి మీ కారు ఇంజిన్ పరిస్థితి ఏంటి? దానిని వేడెక్కకుండా కాపాడేది కూలెంట్. చాలామంది వేసవిలో కూలెంట్ స్థాయిని పట్టించుకోరు. ఇది చాలా ప్రమాదకరం. మీ కారులో కూలెంట్ తగ్గిపోతే లేదా పూర్తిగా ఖాళీ అయిపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : ఆకట్టుకునే డిజైన్, మంచి పనితీరుతో ఉన్న ఈ సీలింగ్ ఫ్యాన్లకు అమెజాన్ లో భారీ డిస్కౌంట్…
మీ కారులో కూలెంట్ ప్రధాన పని ఇంజిన్‌ను చల్లగా ఉంచడం. ఒకవేళ కూలెంట్ స్థాయి తగ్గిపోతే ఇంజిన్ చాలా త్వరగా వేడెక్కుతుంది. అధిక వేడి కారణంగా ఇంజిన్‌లోని భాగాలు ఒకదానితో మరొకటి రాసుకుని పాడైపోతాయి. చివరికి ఇంజిన్ సీజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది జరిగితే మీ జేబుకు భారీ చిల్లు పడుతుంది.
కూలెంట్ తక్కువగా ఉండటం వల్ల ఇంజిన్ టెంపరేచర్ అసాధారణంగా పెరుగుతుంది. దీనివల్ల హెడ్ గాస్కెట్ పేలిపోయే ప్రమాదం ఉంది. హెడ్ గాస్కెట్ పేలితే కూలెంట్, ఇంజిన్ ఆయిల్ కలిసిపోతాయి. దీనికి పెద్ద మరమ్మత్తు చేయాల్సి వస్తుంది. సుమారు రూ.5,000 నుండి రూ.10,000 వరకు ఖర్చు కావచ్చు.
రేడియేటర్, వాటర్ పంప్ కూలెంట్ వల్లే సరిగ్గా పనిచేస్తాయి. కూలెంట్ లేకపోతే వాటర్ పంప్ డ్రై రన్ చేస్తుంది. దీనివల్ల అది అరిగిపోవచ్చు లేదా పూర్తిగా పాడైపోవచ్చు. అధిక వేడి కారణంగా రేడియేటర్ కూడా పేలిపోయే అవకాశం ఉంది.
చాలా కాలం పాటు కూలెంట్ లేకుండా కారు నడిపితే, ఇంజిన్ బ్లాక్ లేదా సిలిండర్ హెడ్‌లో పగుళ్లు ఏర్పడవచ్చు. దీనివల్ల మొత్తం ఇంజిన్‌ను మార్చాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇది చాలా ఖరీదు. మీ జేబు ఖాళీ అవుతుంది. కూలెంట్ లేకపోతే ఇంజిన్ టెంపరేచర్ చాలా వేగంగా పెరిగిపోతుంది. దీనివల్ల మీ కారు నడిరోడ్డుపైనే ఆగిపోయే ప్రమాదం ఉంది.