MS Dhoni- Donald Trump: భారత క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోని ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నాడు. తాజాగా అతడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గోల్ఫ్ ఆడాడు. గత మేలో ముగిసిన ఐపీఎల్–16 తర్వాత మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.
అమెరికా పర్యటన..
మహేంద్రుడు.. అమెరికా పర్యటనలో భాగంగా బెడ్‌మినిస్టర్‌లో ఉన్న ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో మాజీ యూఎస్ ప్రెసిడెంట్‌ను కలిశాడు. ట్రంప్ ఆహ్వానం మేరకే ధోని ఇక్కడికి వెళ్లినట్టు సమాచారం. ధోని – ట్రంప్ కలిసి గోల్ఫ్ ఆడుతున్న ఫొటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
సినిమా ప్రమోషన్..
తమిళ, తెలుగు భాషల్లో రూపొందించిన ‘ఎల్‌జీఎం’ (లెట్స్ గెట్ మ్యారీడ్) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో కనిపించిన ధోని ఆ తర్వాత తాజాగా మీడియాలో కనిపించడం ఇదే తొలిసారి.
యూఎస్ ఓపెన్ వీక్షణ..
అమెరికా పర్యటనలో ఉన్న ధోని.. యూఎస్ ఓపెన్ పోటీలను కూడా వీక్షించాడు. గురువారం స్పెయిన్∙సంచలనం కార్లోస్ అల్కరాజ్ – జర్మనీ ఆటగాడు అలగ్జాండర్ జ్వెరెవ్‌ల మ్యాచ్‌ను తిలకించిన ధోని ఆ తర్వాత ట్రంప్ తో కలిసి గోల్ఫ్ ఆడాడు.
ఇన్‌స్టాలో షేర్ చేసిన ధోని మిత్రుడు..
ధోనితోపాటు అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మిత్రుడు సంఘ్వీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ధోని – ట్రంప్‌లు గోల్ఫ్ ఆడిన ఫొటోలు, వీడియోలను షేర్ చేశాడు. ధోని యూఎస్ ఓపెన్ మ్యాచ్‌ను కూడా సంగ్వీతో కలిసి చూశాడు.