IPL 2024: ఇండియా లో సినిమాకి, క్రికెట్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక క్రికెట్ ప్లేయర్ల మీద అభిమానం అనేది ప్రేక్షకుడిని ఎక్కడి వరకైన తీసుకెళ్తుంది. ఇక ఆ అభిమానం వల్లే జనాలు ఏదైనా చేయడానికి రెడీ గా ఉంటారు. ఇక ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. ఐపీఎల్ లో ధోని ఆడేది చివరి సీజన్ కావడం వల్ల ఆయనను చూడడానికి చాలామంది అభిమానులు చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక అందులో భాగంగానే చాలా మంది క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్ లో కొంటున్నారు. అయినప్పటికీ ధోని అభిమానులు మాత్రం ఎక్కడ తగ్గకుండా భారీ డబ్బులు పెట్టీ బ్లాక్ లో టికెట్లను కొని మరి స్టేడియానికి వెళ్లి ధోనిని చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పటికే ధోని ఇండియా టీమ్ తరపున మూడు ఛాంపియన్స్ ట్రోఫీలను అందించాడు.
అలాగే ఐపీఎల్లో చెన్నై టీమ్ ను 5 సార్లు ఛాంపియన్ గా నిలిపిన ఘనత కూడా ధోని సొంతం…అందువల్లే అతను రిటర్మెంట్ ప్రకటించే ముందు అతని ఆటని చివరిసారిగా చూడాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకోవడంలో తప్పైతే లేదు. ఇక ఏప్రిల్ 8వ తేదీన కలకత్తాతో చెన్నై చెపక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఒక అభిమాని ధోనిని చూడడానికి 64 వేల రూపాయలను పెట్టి బ్లాక్ లో టిక్కెట్లు కొని తన ముగ్గురు పిల్లలతో వచ్చి మ్యాచ్ చూసారట. మ్యాచ్ అనంతరం ఆయన స్పందిస్తూ “నాకు ఆన్లైన్ లో టికెట్లు దొరకలేదు. బ్లాక్ లో 64 వేలు పెట్టి టిక్కెట్లు కొని నా ముగ్గురు కూతుర్లను తీసుకొచ్చి ధోని ని చూపించాను.
నేను ఇంకా నా పిల్లల స్కూల్ ఫీజు కట్టలేదు అని చెబుతూనే, ధోనిని చూడటం చాలా సంతోషంగా ఉంది అంటూ వాక్యానించాడు”. ఆయన కూతురు మాట్లాడుతూ టికెట్ల కోసం మా నాన్న చాలా ట్రై చేశాడు కానీ దొరకలేదు. ఇక్కడికి వచ్చి ధోనిని చూడడం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. ఇక ఈ మాటలను చూస్తున్న చాలామంది వాళ్ల మాటలు మీద చాలా రకాలుగా స్పందించారు…
పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేదు అని మాత్రమే చెప్పాడు. కట్టే అంత డబ్బులు లేవు అని చెప్పలేదు. కదా అంటూ కామెంట్స్ చేయగా…మరి కొంతమంది మాత్రం ఆయన తన పిల్లలతో హాయిగా మ్యాచ్ చూసి చాలా ఎంజాయ్ చేశారు. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఇలా టికెట్లను బ్లాక్ లో అమ్ముకోవడం పట్ల ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అదే సినిమా టికెట్లను బ్లాక్ లో అమ్మితే మాత్రం చాలా వరకు తప్పుగా భావించే గవర్నమెంట్, ఈ విషయాన్ని మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. అంటూ కామెంట్స్ చేస్తున్నారు… ఇక మరికొందరైతే ఆయన బ్లాక్ లో టికెట్లు కోవడం లేదు ఏమి లేదు వాడు పబ్లిసిటీ స్టంట్ కోసం అలా చేస్తున్నాడు. అంటూ ఆయన మీద విమర్శలు చేస్తున్నారు..ఇక మరికొంత మంది మాత్రం క్రికెటర్ల మీద ప్రేమ ఉండాలి. కానీ మరి ఇంత పిచ్చి ప్రేమ ఉండకూడదు అని చెబుతున్నారు.