టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఆడిన భారత్ పాక్ చేతిలో ఓడిపోయింది. దాయాది దేశమైన పాక్ చేతిలో ఓడిపోవడంతో ఇండియన్ అభిమానులు ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. అయితే మొత్తంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీసుకున్న నిర్ణయాలే కొన్ని బెడిసి కొట్టాయని అంటున్నారు. పక్కా ప్రణాళికతో మైదానంలోకి దిగినా ఆ తరువాత కొన్ని విరాట్ మిస్టేక్స్ చేశాడని అంటున్నారు. మరోవైపు మెంటార్ గా ఉన్న ధోని సలహాలను తీసుకోలేదని, ఇషాన్ కిషాన్ తో మాటా మాటికి సందేశాలు చేరవేరుస్తున్నా వాటిని పక్కనబెట్టాడని అంటున్నారు.

ధోనీ సారధ్యంలో భారత్ టీ20 వరల్డ్ కప్ వచ్చింది. అంతేకాకుండా ఆయన కెప్టెన్సీ ఉన్న సమయంలో పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగిన సందర్భంలో భారత్ ఓడిందంటూ లేదు. అంతేకాకుండా ధోని ఆధ్వర్యంలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయం సాధించారు. దీంతో ఇప్పటికే మెళకువలు తెలిసిన ధోనీ మెంటార్ హోదాలు టీమిండియా కెప్టెన్ కు సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ విరాట్ కోహ్లీ ఆ సలహాలను పట్టించుకోలేదన్న చర్చ సాగుతోంది.
కోహ్లి, పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తరువాత ఎవరు వావాలన్న సందేశాన్ని ధోని డ్రెస్సింగ్ రూం నుంచే సందేశాన్ని ఇషాన్ కిసాన్ ద్వారా పంపించాడు. వాటర్ బాటిల్ తీసుకొచ్చిన ప్రతీసారి ఇసాన్ ఏదో ఒక సందేశాన్ని విరాట్ కు చేరవేశాడు. విరాట్ రైట్ హ్యాండ్ బ్యాట్ మెన్. తాను ఔటైతే తరువాత హార్థిక్, పంత్ ఔటైతే జడేజా రావాలన్నది కోహ్లి ప్లాన్. అందుకు అనుగుణంగా జడేశా క్రీజులోకి వచ్చాడు. కానీ ఈ విరాట్, జడేజా జోడీ స్కోరుపెంచలేకపోయింది.
పాండ్యా పీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడినప్పుడు అతని స్థానంలో ఇసాన్ కిసాన్ ను ధోని పంపించాడు. కానీ విరాట్ కు ఏదో చెప్పాడు. కానీ ఆ విషయాన్ని కోహ్లీ పట్టించుకోలేదు. తొలి నాలుగు ఓవర్లు నలుగురు బౌలర్లకు ఇవ్వడమనేది కోహ్లీ నిర్ణయమేనట. అయితే ఇది బెడిసి కొట్టి పాక్ స్కోర్ ను అలవోకగా ఛేదించింది. పాక్ ను మొదట్లోనే ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం జరగలేదు. అయితే ఈ వార్తలు మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.