Ms Dhoni : కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణమైన ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఫస్ట్ బ్యాటింగ్ చేసి తొమ్మిది వికెట్లు లాస్ అయి.. జస్ట్ 103 రన్స్ మాత్రమే చేసింది చెన్నై జట్టు. ఆ తర్వాత ఈ టార్గెట్ ను రెండు వికెట్లు లాస్ అయ్యి..కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అత్యంత ఈజీగా ఫినిష్ చేసింది. 59 బంతులు మిగిలి ఉండగానే ఈ టార్గెట్ ను రీచ్ అయింది. ఈ విక్టరీ ద్వారా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పాయింట్ల పట్టికలో థర్డ్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది. ఇప్పటిదాకా థర్డ్ ప్లేస్ లో ఉన్న బెంగళూరు జట్టును ఫోర్త్ ప్లేస్ లోకి పంపించింది. ప్రస్తుతం లక్నో జట్టు ఫిఫ్త్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక చెన్నై ఈ ఓటమితో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. చివరి స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉంది.
Also Read : ఫస్ట్ అన్ క్వాప్డ్ కెప్టెన్ ధోని.. ఇంకా ఎన్నో ఘనతలు..
ఆగ్రహం వ్యక్తం చేసిన ధోని
ఈ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత చెన్నై జట్టు తాత్కాలిక కెప్టెన్ ధోని ఒక్కసారిగా బరస్ట్ అయిపోయాడు. తమ జట్టు ఆటగాళ్ల ప్రదర్శన పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు..” కొన్ని మ్యాచ్లలో జట్టు సరిగా ఆడలేక పోతోంది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వేగంగా పరుగులు చేయలేకపోతోంది. వికెట్లు త్వరగా పడుతుండడంతో జట్టు మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. మెరుగైన భాగస్వామ్యాలు నమోదు కావడం లేదు. అత్యంత దారుణంగా పవర్ ప్లే లో కేవలం 31 పరుగులు మాత్రమే చేయడం జట్టులో బ్యాటింగ్ లోపానికి నిదర్శనం గా నిలుస్తోంది. రచిన్ రవీంద్ర, కాన్వే గొప్ప ప్లేయర్లే అయినప్పటికీ.. ఈ మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేకపోయారు.. ప్రామాణికమైన షాట్లు ఆడ లేక పోయారు. లైన్ దాటి కొట్టడానికి ప్రయత్నించలేకపోయారు. రిస్క్ తీసుకొని షాట్లు ఆడక పోవడంతో.. ఆ ప్రభావం జట్టు మీద పడింది.. అందువల్ల భారీ స్కోరు నమోదు కాలేదు. మిగతా ప్లేయర్లు కూడా అంతగా ఆకట్టుకోలేదు. గొప్పగా ఆడతారని భావించిన వారు కూడా చెత్త ఆటను ప్రదర్శించారు. అందువల్లే ఇలాంటి దుస్థితిని జట్టు ఎదుర్కొంటున్నది. అయితే వచ్చే మ్యాచ్లో చెన్నై జట్టు సరికొత్తగా కనిపిస్తుంది. సమూల మార్పులు తీసుకొస్తాం. లోపం ఎక్కడ జరుగుతోందో గుర్తించి.. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని” ధోని వ్యాఖ్యానించాడు. వాస్తవానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధోని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడు. తన సహనాన్ని కోల్పోడు. కానీ శుక్రవారం నాటి మ్యాచ్లో అత్యంత దారుణమైన ఫలితం వచ్చిన తర్వాత.. ధోని తన సహజ సిద్ధ లక్షణానికి భిన్నంగా వ్యవహరించడం అభిమానుల్లో చర్చకు కారణమవుతోంది.
Also Read : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మళ్లీ ఎంఎస్ ధోని.. అసలేమైందంటే