MS Dhoni : శుక్రవారం చిదంబరం స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ (CSK vs KKR) తో జరిగే మ్యాచ్ లో చెన్నై జట్టుకు ధోని నాయకత్వం వహిస్తాడు. సుధీర్ఘ కాలం తర్వాత చెన్నై జట్టుకు ధోని నాయకత్వం వహిస్తున్నాడు. చెన్నై జట్టు ఈ సీజన్లో వరుసగా ఓటములు ఎదుర్కొంటున్నది. ఈ సీజన్లో ముంబై జట్టు పై విజయం సాధించిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా పరాజయాలు చవిచూసింది. దీంతో ఆ జట్టుకు ఇప్పుడు విజయాలు కావాల్సి వచ్చింది. వరుసగా ఓటముల వల్ల చెన్నై జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో.. చెన్నై స్టేడియానికి ప్రేక్షకుల రద్దీ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చెన్నై, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ చూసేందుకు అభిమానులు పోటెత్తుతున్నారు. టికెట్లు కూడా హాట్ కేకుల లాగా అమ్ముడుపోయాయని సమాచారం. ఇక ధోని చెన్నై జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్న నేపథ్యంలో.. స్టార్ స్పోర్ట్స్ ఒక అరుదైన పోస్టర్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.
Also Read : విరాట్ కోహ్లీని ఇంత బాధలో ఎప్పుడూ చూడలేదు.. వైరల్ ఫొటో
ఏమి వివరాలు పేర్కొన్నదంటే
స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ చేసిన ఆ పోస్టర్లో ధోనికి సంబంధించిన అనేక అప్డేట్స్ ను . వెలుగులోకి తెచ్చింది.. అత్యధిక ఐపీఎల్ టైటిల్ సాధించిన జట్టుగా ధోని చెన్నైని నిలిపాడని స్టార్ స్పోర్ట్స్ పేర్కొంది… చెన్నై జట్టును ఐదుసార్లు విజేతగా ఆవిర్భవించేలా చేశాడని స్టార్ స్పోర్ట్స్ కొనియాడింది. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్ గా చెన్నై జట్టుకు.. 133 విజయాలు అందించాడని పేర్కొంది… ఐపీఎల్ లో ఏ కెప్టెన్ తో పోల్చి చూసినా ధోనియే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడని స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. కెప్టెన్ గా అత్యుత్తమ విజయాల శాతాన్ని (59.3%) కొనసాగిస్తూ.. అగ్రభాగంలో నిలిచాడని ధోనిని స్టార్ స్పోర్ట్స్ కొనియాడింది. చెన్నై జట్టును ఐపీఎల్ లో పదిసార్లు ఫైనల్ తీసుకెళ్ళిన ఘనతను ధోని అందుకున్నాడని స్టార్ స్పోర్ట్స్ పేర్కొంది. ఇక ఐపీఎల్ చరిత్రలో అన్ క్యాప్డ్ ఆటగాడిగా వచ్చిన ధోని.. ఈ సీజన్లో చెన్నై జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడని.. ఇది అరుదైన ఘటన అని స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. మొత్తంగా స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పోస్ట్ చేసిన డిజిటల్ పోస్టర్ ధోని అభిమానులకు విపరీతంగా నచ్చింది. దీంతో వారు వివిధ మాధ్యమాలలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.
ధోని చుట్టూ
ధోని చెన్నై జట్టుకు నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో .. సోషల్ మీడియాలో అతని పేరు మార్మోగిపోతోంది. ” తలా” నాయకత్వంలో చెన్నై జట్టు విజయాలు సాధిస్తుందని.. ఈసారి ఫైనల్ వెళ్లి ట్రోఫీ అందుకుంటుందని.. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. 2023 లో చెన్నై జట్టు విజేతగా నిలిచిందని.. ఈసారి కూడా ధోని నాయకత్వంలో అదే మ్యాజిక్ ప్రదర్శిస్తుందని.. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : మైదానంలో కేఎల్ రాహుల్ ‘కాంతారా’ స్టెప్.. అందుకే అలా చేశాడట!