MS Dhoni Birthday: అది 2011.. వన్డే వరల్డ్ కప్.. ఫైనల్ మ్యాచ్ ముంబైలో జరుగుతోంది. భారత్ శ్రీలంక విధించిన టార్గెట్ ఫినిష్ చేస్తోంది. ఇదే క్రమంలో వికెట్లు పడిపోవడంతో కాస్త ఇబ్బందులో పడింది. ఈ దశలో వచ్చిన ధోని గట్టిగా నిలబడ్డాడు. యువరాజ్ సింగ్ తో కలిసి బలమైన ఇన్నింగ్స్ నిర్మించాడు. జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. విన్నింగ్ షాట్ కొట్టి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. వాస్తవానికి ఆస్థానంలో మరో ఆటగాడు గనుక ఉండి ఉంటే వేరే విధంగా ఉండేది. అక్కడ ఉంది ధోని కాబట్టి మిస్టర్ కూల్ లాగా ఉండిపోయాడు. అంతటి విజయం సాధించినప్పటికీ జస్ట్ నిశ్శబ్దాన్ని మాత్రమే ఆశ్రయించాడు. ఈ ఉదాహరణ చాలు ధోని వ్యక్తిత్వం గురించి చెప్పడానికి. కేవలం అప్పుడే కాదు.. అనేక సందర్భాలలో ధోని నిశ్శబ్దాన్ని మాత్రమే ఆశ్రయించాడు. ఎదిగి ఉన్నా సరే ఒదిగి ఉండాలని.. అనుకున్నాడు. దానిని నిరూపించి చూపించాడు. అందువల్లే ధోని అంటే యావత్తు దేశం మొత్తం అవమానిస్తుంది. అతడు ఆడుతుంటే ఊగిపోతుంది.
Also Read: టీమిండియా గెలిచాక ఆ జర్నలిస్ట్ కోసం వెతికిన శుభ్ మన్ గిల్.. కనిపించకుండా పోయాడు
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ధోని చెన్నై జట్టు తరఫున ఆడుతున్నాడు. కేవలం ధోనిని చూసేందుకే వేలాది మంది అభిమానులు వస్తుంటారు. ఆ సమయంలో “తలా” అనే పేరు స్టేడియంలో మార్మోగుతుంది. చెన్నై చెపాక్ స్టేడియం పసుపు సముద్రంగా మారుతుంది. ధోని భారీగా పరుగులు చేయలేకపోయినప్పటికీ.. దూకుడుగా ఆడలేక పోయినప్పటికీ అభిమానులు అతడిని ఆరాధిస్తూనే ఉంటారు. ప్రేమిస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో అతడి పేరును మారుమోగేలా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే చెన్నై జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపిన చరిత్ర ధోనిది. అనేకసార్లు ఫైనల్ దాకా తీసుకువెళ్లిన ఘనత కూడా అతనిదే. అందువల్లే చెన్నై అభిమానులు అతడిని సొంత అన్నను చేసుకున్నారు. అతడిని వెయ్యినోళ్ల పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు..”ఒకవేళ నేను ఆస్పత్రిలో ఉంటే.. స్ట్రెచర్ పై తీసుకొచ్చి క్రికెట్ ఆడిస్తారని” ఇటీవల ధోని వ్యాఖ్యానించాడు అంటే.. అతడికి చెన్నై జట్టు మేనేజ్మెంట్ కు ఎలాంటి బాండింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అతడిని చెన్నై అభిమానులు ఏ స్థాయిలో ఆరాధిస్తారో చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read: మూడో టెస్టులో వాళ్ళిద్దరికీ మూడింది.. బుమ్రా, అర్ష్ దీప్ ఎంట్రీ ఖాయం.. తేల్చేసిన గిల్
ఇక సోమవారం నాడు ధోని తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా నిరాడంబరంగా వేడుకలు జరుపుకున్నాడు. తనకు అత్యంత సన్నిహితుల మధ్య కేక్ కట్ చేశాడు. ఇందులో ఆడంబరం లేదు. అట్టహాసం అంతకన్నా లేదు. అయితే ధోని అభిమానులు మాత్రం అతడి జన్మదిన వేడుకలను ఒక రేంజ్ లో చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులోని చెన్నై నగరంలో ధోని కటౌట్ అత్యంత భారీ ది ఏర్పాటు చేశారు. సినిమా హీరో ఒక మించిన రేంజ్ లో కటౌట్ ఏర్పాటు చేసి సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. అంతేకాదు ట్విట్టర్లో హ్యాపీ బర్త్ డే టు యు ధోని అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.. అనాధాశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో పండ్లు, అన్నదానం చేస్తూ ధోని మీద తమకున్న ప్రేమను ప్రదర్శిస్తున్నారు. ఇంతవరకు టీం ఇండియాలో ఎంతో గొప్ప గొప్ప ఆటగాళ్లు ఆడారు. ఇకపై ఆడుతూనే ఉంటారు. కానీ ధోని కి ఉన్న ఫ్యాన్ బేస్ వేరు. ధోని కి ఉన్న లెవెల్ వేరు. ఎందుకంటే అతను డౌన్ టు ఎర్త్.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అతడి నైజం. అలానే ఉండడం అతడి ఇజం. హ్యాపీ బర్త్ డే టు యు “తలా”.. సాగిపో తారాజువ్వలా..
స్నేహితులతో జన్మదిన వేడుకలు జరుపుకున్న మహీంద్రా సింగ్ ధోని #HappyBirthdayMSDhoni pic.twitter.com/y5uUV8ozoZ
— ChotaNews App (@ChotaNewsApp) July 7, 2025