Homeక్రీడలుMohit Sharma: 34 ఏళ్ల వయసులో.. 100 వికెట్ల క్లబ్ లోకి ఆ బౌలర్

Mohit Sharma: 34 ఏళ్ల వయసులో.. 100 వికెట్ల క్లబ్ లోకి ఆ బౌలర్

Mohit Sharma: గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ ఐపిఎల్ లో అధరగొడుతున్నాడు. 34 ఏళ్ళ వయసులో 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలోకి చేరాడు ఈ బౌలర్. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి 2013లో మోహిత్ శర్మ అడుగు పెట్టాడు. చెన్నై జట్టుకు తొలి సీజన్ లో ఆడాడు ఈ ఫాస్ట్ బౌలర్. తొలి సీజన్లోనే అద్భుతమైన ప్రదర్శనతో అడ్డదరగొట్టాడు. ఆడిన 15 మ్యాచుల్లో 20 వికెట్లు తీశాడు. ఆ తరువాత కొన్నాళ్లపాటు పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టులో కీలక ప్లేయర్ గా ఎదిగాడు మోహిత్ శర్మ. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి వికెట్లు తీసి ఆపద్బాంధవుడిలా నిలిచాడు.

92 మ్యాచ్ ల్లో 100 వికెట్లు తీసి..

ఐపీఎల్ లో 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మోహిత్ శర్మ చేరాడు. అతికొద్ది మంది మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఇప్పటి వరకు 9 మంది భారత ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ఈ ఘనతను దక్కించుకోగా.. మోహిత్ శర్మ పదో వాడిగా ఈ జాబితాలో చేరిపోయాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లోనే అద్భుతంగా రాణిస్తున్న ఢిల్లీ బ్యాటర్ అక్షర పటేల్ 27(30), మంగళవారం నాటి మ్యాచ్ లో జోరు మీద ఉన్న రిపల్ పటేల్ 23(13) వికెట్లను తీసి ఢిల్లీ జట్టు నామమాత్రపు స్కోరుకు పరిమితమయ్యేలా చేశాడు. ఈ రెండు వికెట్లతో 100 వికెట్ల క్లబ్ లో చేరి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఐపీఎల్ లో సృష్టించుకున్నాడు మోహిత్ శర్మ. నిలకడైన ప్రదర్శనతో, ఫాస్ట్ బౌలింగ్ తో అదరగొడుతున్నాడు 34 ఏళ్ల మోహిత్ శర్మ. మోహిత్ శర్మ బౌలింగ్ నైపుణ్యం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న మోహిత్ శర్మ గుజరాత్ జట్టులో కీలకమైన బౌలర్ గా మారిపోయాడు.

RELATED ARTICLES

Most Popular