Phil Salt: ఐపీఎల్ లో ఎంతోమంది క్రికెటర్లు అదరగొడుతున్నారు. అరవీర భయంకరమైన బ్యాటింగ్ తో తమ సత్తాను చాటుతున్నారు. అయితే అతి కొద్ది మంది మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. అటువంటి వారిలో ఢిల్లీ స్టార్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఒకరు. ఈ విధ్వంసకర ఓపెనర్ దారుణంగా విఫలమవుతున్నాడు.
ఐపీఎల్ తాజా ఎడిషన్ లో ఢిల్లీ డాషింగ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సాల్ట్ ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ సీజన్ లో ఇన్నింగ్స్ తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన మూడో ప్లేయర్ గా సాల్ట్ నిలిచాడు.
విఫలమవుతున్న డాషింగ్ ఓపెనర్ సాల్ట్..
గత కొద్ది రోజులుగా ఫిలిప్ సాల్ట్ ఫామ్ లేమితో తడబడుతున్నాడు. ఐపీఎల్ లో ఆడిన నాలుగు మ్యాచ్ లోనూ అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచాడు ఈ విధ్వంసకర ఓపెనర్. ఐదు t20 మ్యాచ్ లో మూడు సార్లు గోల్డెన్ డకౌట్ అయి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్ కు ముందు బంగ్లాదేశ్ తో ఇంగ్లాండ్ జట్టు టి20 మ్యాచ్ లు ఆడింది. చివరి టీ 20 మ్యాచ్ లో ఎదుర్కొన్న తొలి బంతికే సాల్ట్ అవుటయ్యాడు. ఆ సిరీస్ తరువాత ఐపీఎల్ ఆడుతున్నాడు సాల్ట్. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఓపెనర్.. తొలి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడాడు. ఈ మ్యాచ్ లో మూడు బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తరువాత మ్యాచ్ సన్ రైజర్స్ జట్టుతో ఆడింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఈ మ్యాచ్ లో ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు సాల్ట్. ఆ తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మరోసారి తలపడింది ఢిల్లీ జట్టు. ఈ మ్యాచ్ లో 35 బంతుల్లో 59 పరుగులు చేసి అదరగొట్టాడు సాల్ట్. ఈ మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చాడని ఢిల్లీ అభిమానులు ఆనందించారు. అయితే, మంగళవారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో మరోసారి విఫలమయ్యాడు ఫిలిప్ సాల్ట్. ఈ మ్యాచ్ లోను మరోసారి ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో చివరి ఐదు టి 20 మ్యాచ్ ల్లో మూడుసార్లు గోల్డెన్ డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచాడు సాల్ట్.
ఐపీఎల్ లో గోల్డెన్ డకౌట్ల జాబితా..
ఐపీఎల్ లో ఈ ఏడాది గోల్డెన్ డకౌట్ గా వెనుదిరుగుతున్న ఆటగాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. సాల్ట్ ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన మూడో ప్లేయర్ గా నిలిచాడు. ఇప్పటి వరకు సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ప్రబ్ సిమ్రాన్ సింగ్, రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ.. గోల్డెన్ డకౌట్లుగా వెనుదిరిగారు. సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ సీజన్ లో పలుమార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
Web Title: Phil salt gets golden duck as delhi capitals face gujarat titans in ipl
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com