Viral Video : ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ ఆరు వికెట్లు సాధించాడు. కమిన్స్, బోలాండ్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు ఒక వికెట్ నష్టానికి 86 రన్స్ చేసింది. భారత్ సాధించిన స్కోర్ కు మరో 94 పరుగులు వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో బుమ్రా మాత్రమే ఒక వికెట్ సాధించాడు. అతడు ఖవాజా(13) వికెట్ పడగొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్, హర్షిత్ రాణా, అశ్విన్ ఒక్క వికెట్ కూడా సాధించలేదు. దీంతో తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అప్పర్ హ్యాండ్ సాధించారు..
మహమ్మద్ సిరాజ్ అనుచిత ప్రవర్తన..
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రవర్తించిన తీరు అనుచితంగా ఉందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో లబూ షేన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో సిరాజ్ బంతి వేయడానికి వస్తుండగా ఆగమని లబు షేన్ సైగ చేశాడు. దీంతో పట్టరాని ఆగ్రహంతో సిరాజ్ బంతిని బ్యాటర్ వైపు విసిరి కొట్టాడు. అయితే తన సైట్ స్క్రీన్ ముందు నుంచి ఒక ప్రేక్షకుడు వెళ్తున్నాడని.. లబూషేన్ చెప్పాడు. అయినప్పటికీ సిరాజ్ బంతిని అలా విసిరి కొట్టాడు. ఇది మైదానంలో కలకలం రేపింది. సిరాజ్ అలా ప్రవర్తించడంపై అభిమానులు మండిపడుతున్నారు. ” సిరాజ్ పట్టారని ఆగ్రహంతో ఉన్నాడు. లబూ షేన్ చెబుతున్నప్పటికీ అతడు వినిపించుకోవడం లేదు. బంతిని నేరుగా విసిరి కొట్టాడు. అది సిరాజ్ లో ఆగ్రహాన్ని తెలియజేస్తోంది. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ఇలా ఒక ఆటగాడు బంతిని విసిరి కొట్టడం సరైన విధానం కాదు. అది ఐసీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి.. అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని” నెటిజన్లు చెబుతున్నారు.. కాగా, సిరాజ్ వ్యవహరించిన తీరు వల్ల అతడు ఐసీసీ చర్యలకు గురయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ” గతంలోనూ మహమ్మద్ సిరాజ్ కొన్ని మ్యాచ్ లలో ఇలాగే అగ్నిపర్వతం లాగా బద్దలయ్యాడు. అయితే అప్పుడు ఐసీసీ ఎటువంటి చర్యలూ అతనిపై తీసుకోలేదు. మహమ్మద్ సిరాజ్ కు లబూ షేన్ చెబుతున్నప్పటికీ వినిపించుకోలేదు. అందువల్లే అలా బంతిని విసిరి కొట్టాడు. ఒక ఆటగాడికి ఆగ్రహం ఉండాలి కాని.. ఇలా అర్థంలేని ఆగ్రహాన్ని ప్రదర్శిస్తే రేపటి నాడు కెరియర్ ప్రమాదంలో పడుతుంది. గతంలో చాలామంది ఆటగాళ్లు ఇలానే వ్యవహరించారని” క్రికెట్ విశ్లేషకులు ఈ సందర్భంగా చెబుతున్నారు.
అడి లైడ్ టెస్టులో మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ వేస్తుండగా ఆస్ట్రేలియా బ్యాటర్ లబూషేన్ ఆగమని చెప్పాడు. దీంతో సిరాజ్ ఆగ్రహానికి గురై.. బంతిని ఒక్కసారిగా బ్యాటర్ వైపు విసిరేశాడు. సిరాజ్ ప్రవర్తన పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.#AusvsInd#MohammedSiraj pic.twitter.com/sDNKsXfaG2
— Anabothula Bhaskar (@AnabothulaB) December 6, 2024