Mohammed Siraj : ఆదివారం నాటి నుంచి సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో జనై భోస్లే, మహమ్మద్ సిరాజ్ గురించి చర్చ జరిగింది. దీనికి తోడు Instagram లో ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నారు. పైగా ఈ ఏడాది జరిగిన మెగా వేలంలో గుజరాత్ జట్టు మహమ్మద్ సిరాజ్ ను కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో గుజరాత్ జట్టును మాత్రమే Instagram, ఇతర సామాజిక మాధ్యమ ఖాతాలలో జనై భోస్లే ఫాలో అవుతోంది. దీంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతోంది.. ఏదో ఉందని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు మహమ్మద్ సిరాజ్ జనై భోస్లే అన్యోన్యంగా ఉండడంతో ఇదంతా నిజమే.. వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నది వాస్తవమేనని జాతీయ మీడియా తేల్చేసింది..” వారిద్దరు సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నారు. ప్రైవేట్ పార్టీలలో పాల్గొంటున్నారు. జీవితంలో దాదాపుగా స్థిరపడ్డారు. అందువల్లే వీరిద్దరూ ఈ నిర్ణయానికి వచ్చారేమోనని” స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరిగింది.
భాయ్ ఫ్రెండ్ కాదట..
జాతీయ మీడియాలో ప్రచారం జరిగినట్టు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్టు.. జనై భోస్లే మహమ్మద్ సిరాజ్ ను ప్రేమించడం లేదట.. చివరికి అతడిని ఇష్టపడటం లేదట. ఇదే విషయాన్ని జనై భోస్లే పేర్కొంది. అంతేకాదు తమపై జరుగుతున్న ప్రచారానికి మహమ్మద్ సిరాజ్ కేవలం ఒకే ఒక్క పోస్టుతో తిప్పి కొట్టారు. ” మా ఇద్దరిదీ అన్నా చెల్లెళ్ళ బంధం” అని అర్థం వచ్చేలా ఒక పోస్ట్ చేశాడు. జనై భోస్లే అదే అర్థం వచ్చే విధంగా పేర్కొంది. ” హమ్ తుమ్హారే హై సనమ్” సినిమాలోని తారోంకా చమక్ తా”పాట లిరిక్ ను వారిద్దరు పంచుకున్నారు. ఈ పాట వెనుకటి కాలంలో హిందీ చిత్రంలోనిది. హమ్ తుమ్హారే హై సనమ్ లోని ఈ పాట అప్పట్లో సంచలనం సృష్టించింది. సోదరి సోదరుల మధ్య బంధాన్ని విశదీకరిస్తూ ఈ పాట సాగుతుంది. కాగా, ఇటీవల ముంబైలో జనై భోస్లే జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆశా భోస్లే కూడా హాజరైంది. క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ వంటి వారు హాజరయ్యారు. జనై భోస్లే కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ పార్టీకి మహమ్మద్ సిరాజ్ కూడా హాజరయ్యాడు.. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్, త్వరలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కి మహమ్మద్ సిరాజ్ కు అవకాశం లభించలేదు. దీంతో అతడు ప్రస్తుతం దొరికిన సమయాన్ని రంజీలో ఆడేందుకు వినియోగించుకుంటున్నాడు. ఖాళీ దొరికినప్పుడల్లా ఇలా పార్టీలకు వెళ్తున్నాడు. అలా పార్టీలకు వెళ్లడమే సిరాజ్ చేసిన పాపమైంది. అందువల్లే అతడు ఇలా అడ్డంగా బుక్కయ్యాడు. చివరికి మా ఇద్దరి మధ్య ఉంది అన్నా చెల్లెళ్ళ బంధం అని జనై భోస్లే, మహమ్మద్ సిరాజ్ స్పష్టం చేయడంతో.. రూమర్స్ కు చెక్ పడింది.