Mohammed Shami: సుదీర్ఘకాలంగా మహమ్మద్ షమీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. 2023 డిసెంబర్లో జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత.. అతడు దాదాపు ఏడాది పాటు క్రికెట్ కు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స చేయించుకొని.. చాలా రోజులు చికిత్స పొందాడు. కొద్దిరోజులు నేషనల్ క్రికెట్ అకాడమీలో.. అంతకంటే ముందు లండన్ లో అతడు విశ్రాంతి తీసుకున్నాడు. ఇటీవల రంజీలో మళ్లీ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. వాస్తవానికి షమీ పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధిస్తే టి20 వరల్డ్ కప్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కచ్చితంగా ఆడేవాడు. కానీ అతడు ఊహించిన స్థాయిలో.. ఆశించిన స్థాయిలో సామర్థ్యాన్ని నిరూపించుకోలేకపోయాడు. దీంతో రంజీలోకి ఆడాల్సి వచ్చింది. రంజీలో కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. తర్వాత తన లయను అందుకున్నాడు. అయినప్పటికీ గొప్ప గణాంకాలను నమోదు చేయలేకపోయాడు. అయితే చాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకొని షమీని టీమిండియా మేనేజ్మెంట్ ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక చేసింది. అయితే కోల్ కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో షమీ మైదానంలో అడుగుపెట్టలేదు. గాయం వల్ల అతడు తుది టెస్టులో పాస్ కాలేదు. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ అతడు ఆడలేదు. చివరికి రాజ్ కోట్ మైదానంలో జరిగిన మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు.
సత్తా చాటలేదు
పునరాగమనం గొప్పగా చేస్తాడని అనుకున్నప్పటికీ.. షమీ ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. వాస్తవానికి ఒకప్పటిలాగా వేగవంతంగా షమీ బంతులు వేలలేకపోయాడు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసినప్పటికీ.. ఇంగ్లాండ్ బ్యాటర్లను షమీ ఇబ్బంది పెట్టలేకపోయాడు.. 14 నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నప్పటికీ.. తన కం బ్యాక్ ను షమీ ఆ స్థాయిలో చూపించలేకపోయాడు. నవంబర్ 2023లో అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆడిన మహమ్మద్ షమి.. ఆ తర్వాత మొన్నటివరకు ఆడలేదు. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో ఆడిన షమీ..షార్ట్ మిడ్ వికెట్ వైపుగా బంతులు వేశాడు.. అయితే షమీ వేసిన తొలి ఓవర్లో సిక్సర్ సమర్పించుకున్నాడు. ఇక రెండో ఓవర్లో డెడ్ స్ట్రైట్ సీమ్ తరహాలో బంతులు వేశాడు. ఇక ఇటీవలి రంజి ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడిన షమీ 43 ఓవర్లు బౌలింగ్ చేశాడు.. సయ్యద్ మస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో 9 మ్యాచ్ లు ఆడాడు. 7.85 ఎకనామి రేటుతో 11 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం బుమ్రా గాయపడటం.. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఉండడంతో టీమ్ ఇండియా మేనేజ్మెంట్ లో టెన్షన్ ఎలా ఉంది. ఈ సమయంలో షమీలాంటి బౌలర్ ఆపద్బాంధవుడు అవుతాడు అనుకుంటే.. అతడు కూడా పునరాగమనాన్ని ఏమంత గొప్పగా చాటలేదు. ఒకవేళ పూణె మ్యాచ్ లో గనుక సత్తా చాటితే టీమిండియా కు కొంతలో కొంత రిలీఫ్ లభిస్తుంది.