Mithali Raj : క్రికెట్ కు వీడ్కోలు పలికిన మిథాలీ రాజ్.. క్రికెట్ కు సంబంధించిన వ్యవహారాలలో తలమునకలై ఉంది. ఆమె క్రికెట్ కు దూరంగా ఉన్నప్పటికీ.. క్రికెట్ ఆమె నుంచి దూరం కాలేదు. సోషల్ మీడియాలో మిథాలీ రాజ్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అభిమానులకు ఇస్తూ ఉంటుంది. అయితే ఇటీవల మిథాలీ రాజ్ ఓ యూట్యూబర్ కు ఇంటర్వ్యూ వచ్చింది. ఈ సందర్భంగా అనేక విషయాలను పంచుకుంది . తన కెరియర్ మొదలైన విధానం, సాగిన విధానం, ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం, అమితంగా ఆనందాన్ని ఆస్వాదించిన క్షణం.. అన్నిటిపై మాట్లాడింది. అయితే తనకు ఎదురైన ఒక అనుభవం గురించి మిథాలీ రాజ్ సరదాగా వ్యాఖ్యానించింది. కానీ దాని లోతుల్లోకి వెళితే ఒక ఆడపిల్లను మన సమాజం ఎలా స్వీకరిస్తుందనే విషయంపై పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుంది. అంతేకాదు ఒక ఆడపిల్ల ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా వంటింటి కుందేలుగా చూడటం బాధ కలిగిస్తుంది. మిథాలీ రాజ్ యుక్త వయసులో ఉన్నప్పుడు పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఇప్పటికీ ఆమె కెరియర్ కూడా బాగుంది. పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో ఒప్పుకోవాల్సి వచ్చింది. అలా పెళ్లి చూపులకు ఒప్పుకుంది. ఆమెను చూడడానికి వచ్చిన వ్యక్తి ” నువ్వు ఎంతమంది పిల్లలను కంటావ్? క్రికెట్ రావడం జరిగిన తర్వాత ఆటం కుదరదు కదా? నువ్వు ఆటకు విరామం ఇచ్చి పిల్లలను చూసుకుంటావా? అత్తా మామలకు సపర్యలు చేస్తావా?” అని ప్రశ్నలు వేశాడు. ఇది సహజంగానే మిథాలీ రాజ్ కు కోపం తెప్పించింది. వెంటనే అతడిని రిజెక్ట్ చేసింది. మరో వ్యక్తి మిథాలీ రాజ్ ను చూడ్డానికి వచ్చాడు. అప్పుడు అతడు కూడా ఇలాంటి ప్రశ్నలే వేశాడు. దీంతో మిథాలీ రాజ్ కు ఒళ్లు మండిపోయింది. ఆ తర్వాత జన్మలో కూడా మిథాలీ రాజ్ పెళ్లి సంబంధాల వైపు వెళ్ళలేదు. పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. 42 సంవత్సరాల వయసు ఉన్నా..మిథాలీ రాజ్ ఒంటరిగానే ఉంది. ఆ మధ్య శిఖర్ ధవన్ తో మిథాలీ రాజ్ పెళ్లి అని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లు అని తర్వాత తేలింది.
అద్భుతమైన రికార్డులు
మిథాలీ రాజ్ కు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. మహిళల క్రికెట్ చరిత్రలో ఎక్కువసార్లు 50+ పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచింది. వన్డేలలో ఎక్కువ స్కోర్ చేసిన క్రీడాకారిణి గా రికార్డు సృష్టించింది. భారత జట్టు తరఫున మెగా టోర్నీలలో హైయెస్ట్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా మిథాలీ రాజ్ అరుదైన ఘనతలు అందుకుంది. ఆమె ఆధ్వర్యంలో భారత జట్టు ఐదుసార్లు ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇన్ని ఘనతలు సాధించినప్పటికీ..మిథాలీ రాజ్ ను వంటింటి కుందేలుగా చూడటం.. క్రికెట్ ను వదులుకోవాలని చెప్పడం నిజంగా విషాదం. అందువల్లే తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ వదులుకోలేక.. చివరికి పెళ్లినే రద్దు చేసుకుంది మిథాలీ రాజ్.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Mithali raj shared details about how her career started during an interview with a youtuber
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com