MI Vs SRH 2025: గురువారం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ ముందు డేల్ స్టెయిన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఆ స్థాయి స్కోర్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 162 పరుగులు మాత్రమే చేసింది.. ఈ లక్ష్యాన్ని ముంబై జట్టు 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.. మొత్తంగా ఇటీవల పంజాబ్ జట్టుపై భారీ విజయం సాధించిన హైదరాబాద్.. ముంబై జట్టుపై మాత్రం ఆ స్థాయిలో ప్రదర్శన చూపలేకపోయింది..
Also Read: ముంబై పై ఓడిపోయినా.. SRH కు ప్లే ఆఫ్ అవకాశం.. దానికోసం ఏం చేయాలంటే?
డేల్ స్టెయిన్ పై ముంబై ఇండియన్స్ కౌంటర్
హైదరాబాద్ జట్టు 300 పరుగులు చేస్తుందని డేల్ స్టెయిన్ వేసిన అంచనాలు తప్పయ్యాయి. 300 కాకుండా 162 రన్స్ చేసింది. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. బౌలింగ్లో దారుణమైన ప్రదర్శన చేసింది. ఫలితంగా హైదరాబాద్ జట్టు ఓటమి పాలైంది. అయితే హైదరాబాద్ జట్టు 300 పరుగులు చేస్తుందని స్టెయిన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు స్పందించింది..” స్టెయిన్ ఊహించినట్టుగానే మొత్తంగా 328 పరుగులు వచ్చాయి. (రెండు జట్లు కలిపి చేసిన పరుగులు) అంటూ ట్విట్టర్ ఎక్స్ లో గట్టి సెటైర్ వేసింది. అయితే హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్లో 300 స్కోర్ చేస్తుందని స్టెయిన్ జోస్యం చెప్పాడు. ఎందుకంటే ఈ సీజన్లో రాజస్థాన్ జట్టుతో హైదరాబాద్ 200కు మించి పరుగులు చేసింది. పంజాబ్ జట్టుతో రికార్డు స్థాయి స్కోరును చేదించింది. ఈ క్రమంలోనే జోరు మీద ఉన్న హైదరాబాద్ ఆటగాళ్లు 300 పరుగులు చేస్తారని స్టెయిన్ అంచనా వేశాడు. అయితే అతని అంచనాను ముంబై ఇండియన్స్ జట్టు తలకిందులు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి.. హైదరాబాద్ జట్టును ముంబై బ్యాటింగ్ కు ఆహ్వానించింది. స్లో పిచ్ పై పదునైన బంతులు వేసి హైదరాబాద్ ఆటగాళ్లకు ముంబై బౌలర్లు చుక్కలు చూపించారు. మొత్తంగా ఓటమి పాలు చేశారు. గత సీజన్లో హైదరాబాద్ ఆటగాళ్లు దుమ్మురేపారు.. నాలుగైదు మ్యాచ్లలో 200కు నుంచి పరుగులు చేశారు. కానీ ఈ సీజన్లో ఆస్థాయిలో ఆట తీరు ప్రదర్శించలేకపోతున్నారు. పైగా హైదరాబాద్ ఆటగాళ్లు సొంత మైదానం మీద మాత్రమే పరుగులు చేయగలుగుతున్నారు. మిగతా మైదానాలలో దారుణంగా విఫలమవుతున్నారు. అందువల్లే భారీగా పరుగులు చేయలేకపోతున్నారు. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ హైదరాబాద్ ఆటగాళ్ల వైఫల్యాన్ని మరోసారి చూపించింది.. గత సీజన్లో భారీగా పరుగులు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ ఆటగాళ్లు ఈసారి 300 స్కోర్ చేస్తారని స్టెయిన్ అంచనా వేశాడు. కాకపోతే దానిని హైదరాబాద్ ఆటగాళ్లు సాధించలేకపోయారు.
Also Read:సన్ రైజర్స్ హైదరాబాద్ గుట్టు పట్టేశాయి.. ఆ ప్రణాళికతో ఓడిస్తున్న ప్రత్యర్థి జట్లు