Rayalaseema : రాయలసీమ అంటే అది కాదు. అసలు రాయలసీమ అలా ఉండదు.. రాయలసీమ రతనాలసీమ. మెండుగా పంటలు.. దండిగా మనుషులు.. నిండుగా నీళ్లతో ఆ ప్రాంతం ఒకప్పుడు ఉంది. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో అలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి.. రాయలసీమలో ఎన్నో రిజర్వాయర్లు.. మరెన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ మాత్రమే కాదు.. రాయలసీమలోను చాలా జిల్లాల్లో అరటి తోటలు.. కొబ్బరి తోటలు.. జామ తోటలు.. నిమ్మ తోటలు సాగవుతున్నాయి. ఇవి మాత్రమే కాదు వేరుశనగ, పొద్దుతిరుగుడు, రాగులు, సజ్జలు, పచ్చ జొన్నల వంటి పంటలు కూడా సాగవుతుంటాయి. రాయలసీమ ప్రాంతం నుంచి ఇవి ఇతర ప్రాంతాలకు దిగుమతి అవుతుంటాయి. ఇక రాయలసీమలో అవుకు అనే రిజర్వాయర్ చాలా ప్రత్యేకమైనది. రాయలసీమలో ఉన్న అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక్కడ వాతావరణం చాలా విచిత్రంగా ఉంటుంది. కొండలు, లోయలు ఇక్కడ ఉన్నప్పటికీ.. ఇవి మెరుస్తూ ఉంటాయి. ఇందులో గ్రానైట్, నల్లరాయి బండలు ఉంటాయి. ఈ కొండలపైకి ఎక్కుతూ ఉంటే చదునైన ప్రాంతాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి వాతావరణమే అవుకును మిగతా వాటితో పోల్చి చూస్తే భిన్నంగా కనిపించేలా చేస్తుంది.. ఇక్కడ కొండలు, జలపాతాలు విభిన్నంగా ఉంటాయి. అవి పర్యాటకుల మనసును దోచేస్తూ ఉంటాయి.
Also Read : ఇదేం విడ్డూరం.. చెట్లను మొక్కలుగా మార్చుతున్నారు.. ఇదెలా సాధ్యం?
గతంలో 1.50 టీఎంసీల నిల్వ నీటి సామర్థ్యం
అవుకు జలాశయం నిల్వ నీటి సామర్థ్యం గతంలో 1.50 టీఎంసీలు ఉండేది. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ రిజర్వాయర్ నీటి సామర్థ్యం 4.50 పీఎంసీలకు పెరిగింది..అవుకు రిజర్వాయర్ కొండల మధ్య ఉంటుంది. అందువల్ల ఇక్కడ ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు కాకుండా నిల్వ అనేది సామర్థ్యం పెంచే అవకాశం దక్కింది. ఈ కొండలను, గుట్టలను ఆనకట్టగా మార్చిన ఇంజనీర్లు.. అద్భుతమైన ప్లాన్లు వేసి అవుకు రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచారు. ఈ కొద్దిపాటి నీళ్లతోనే ఇక్కడి రైతులు బంగారం లాంటి పంటలు పండిస్తారు. కర్నూల్ సోనా బియ్యం ఈ నీటితోనే పండుతాయి..అవుకు రిజర్వాయర్ చుట్టూ వరి పొలాలు కనువిందు చేస్తుంటాయి. కోనసీమకు మించి పచ్చదనంతో అలరారుతూ ఉంటాయి. మూడు పంటలు పండటం ఇక్కడ భూముల ప్రత్యేకత. పైగా ఇక్కడి కర్నూల్ సోనా బియ్యం దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ఈ బియ్యానికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.. అవుకు రిజర్వాయర్ నీళ్ల వల్ల ఈ బియ్యానికి ప్రత్యేకమైన రుచి ఉంటుందని రైతులు చెబుతుంటారు. అంతేకాదు అవుకు రిజర్వాయర్ ఏర్పాటైన కొండల్లో భారీగా గ్రానైట్ నిల్వలు ఉన్నాయి. కాకపోతే వాటిని వెలికి తీస్తే రిజర్వాయర్ మనుగడకి ప్రమాదం కాబట్టి.. వాటిని అలాగే ఉంచారు.
Also Read: సగం ఆడ, సగం మగ.. కొలంబియాలో వింత పక్షి.. అర్ధనారీశ్వరుడిని గుర్తుచేస్తోంది!