MI Vs PBKS Qualifier 2: ఫైనల్ స్థానం కోసం జరిగే పోటీ కావడంతో ఈ మ్యాచ్ ఉత్కంఠ సాగే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల ఎలిమినేటర్ మ్యాచ్ జరిగినట్టుగానే.. ఇందులో కూడా చివరి క్షణం వరకు మలుపులు చోటు చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. క్వాలిఫైయర్ -2 మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ మైదానం ముంబై జట్టుకు ఏమాత్రం కలిసి రాలేదు. ఎందుకంటే 2014లో ఈ వేదికపై రాజస్థాన్ జట్టుపై ముంబై విజయం సాధించింది.. ఆ తర్వాత ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడినప్పటికి.. ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా ముంబై గెలుపొందలేదు. అయితే ఈ సెంటిమెంట్ పంజాబ్ జట్టుకు వర్క్ అవుట్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ముంబై బీభత్సమైన ఫామ్ లో ఉన్న నేపథ్యంలో.. పంజాబ్ జట్టు జాగ్రత్తగా ఉండాలని.. తుది వరకు అప్రమత్తంగా ఉండాలని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకవేళ అహ్మదాబాదులో వర్షం కురిసి మ్యాచ్ కనుక రద్దు అయితే.. రిజర్వ్ డే రోజున మ్యాచ్ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. జూన్ 2న రిజర్వ్ డే గా నిర్ణయించారు. అయితే ఆ రోజు కూడా వర్షం జరగకపోతే మ్యాచ్ రద్దు అవుతుంది. అప్పుడు పాయింట్లు పరంగా ముంబై కంటే ముందు వరుసలో ఉన్న పంజాబ్ జట్టు ఫైనల్ వెళ్తుంది. ఒకవేళ వర్షం గనుక కురిసి.. మ్యాచ్ రిజర్వ్ డే రోజు కూడా నిర్వహించడానికి సాధ్యం కాకపోతే పంజాబ్ జట్టుకు ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక ప్రస్తుతం పాయింట్లు పట్టికలో పంజాబ్ జట్టు అగ్రస్థానంలో.. ముంబై జట్టు 4 స్థానంలో ఉంది.
Also Read: ఆపరేషన్ సిందూర్: కూలిన భారత ఫైటర్ జెట్స్.. గోప్యత ఎందుకు?
వాతావరణ శాఖ అంచనా ప్రకారం అహ్మదాబాద్ లో ఆదివారం వర్షం కురడానికి అవకాసం లేదు. కేవలం రెండు శాతం మాత్రమే వర్షం కొరవడానికి అవకాశం ఉంది. జూన్ 2న వర్షం కురవడానికి 25% అవకాశం ఉంది. ఈ ప్రకారం చూస్తే క్వాలిఫైయర్ -2 మ్యాచ్ నిర్వహించడానికి ఆదివారం ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
ఇక ఐపీఎల్ లో ఇప్పటివరకు ముంబై, పంజాబీ జట్ల మధ్య 32 మ్యాచులు జరిగాయి. ఇందులో పంజాబ్ జట్టు 15 మ్యాచ్లలో విజయం సాధించింది. ముంబై జట్టు 17 మ్యాచ్లలో గెలుపును దక్కించుకుంది. ఈ సీజన్లో లీగ్ దశలో పంజాబ్ జట్టుతో ముంబై తలపడినప్పుడు 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్లో గెలిచి రివెంజ్ తీర్చుకోవాలని ముంబై ప్లేయర్లను అభిమానులు కోరుతున్నారు. ఇక గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం ముంబై జట్టు విజయం సాధించడానికి 60%, పంజాబ్ జట్టు గెలుపొందడానికి 40 శాతం అవకాశం ఉంది..
ఆటగాళ్ల అంచనా ఎలా ఉందంటే
పంజాబ్: అయ్యర్ (కెప్టెన్), నెహల్ వదేరా,జోష్ ఇంగ్లిస్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, స్టోయి నీస్, మార్కో జాన్సన్, అర్ష్ దీప్ సింగ్, జేవియర్ బార్ట్ లెట్, యజువేంద్ర చాహల్
ముంబై ఇండియన్స్
హార్థిక్ పాండ్యా (కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, బుమ్రా, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, బౌల్ట్, అశ్విని కుమార్, శ్రీజిత్ కృష్ణన్, రాబిన్ మింజ్.