MI vs CSK – MS Dhoni : మామూలు బ్యాటింగ్ కాదది.. శివతాండవం, పరాక్రమం, దూకుడు, ఎదురుదాడి అంటుంటాం కదా.. అంతకుమించి ఉపోద్ఘాతాలు వాడాల్సి ఉంటుంది.. అలా ఉంది మరి ధోని చేసిన బ్యాటింగ్ తీరు.. కేవలం నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతడు 20 పరుగులు చేశాడు. చివర్లో వచ్చి పెను తుఫాను సృష్టించి వెళ్ళాడు. అంతకుముందు చెన్నై ఆటగాళ్లు ఇద్దరు, ముగ్గురు మినహా మిగతావారు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. వారి బ్యాటింగ్ ఫలితంగా ఫోర్లు ధారాళంగా వెళ్లిపోయాయి, సిక్సర్లు అభిమానులతో కేరింతలు కొట్టించాయి. మొత్తంగా చెన్నై జట్టు ఇన్ని రోజులపాటు అదిమి పెట్టుకున్న పరుగుల కరువును తీర్చాయి. బ్యాటింగ్ కు సహకరిస్తున్న మైదానంపై ఆటగాళ్లు వీరవిహారం చేశారు. బౌలర్ ఎవరనేది చూడకుండా ఎదురుదాడికి దిగారు. భీకరమైన బ్యాటింగ్ తో అసలు సిసలైన పరాక్రమాన్ని ప్రదర్శించారు.
ముంబై వాంఖడే మైదానం వేదికగా ఆదివారం రాత్రి ముంబై, చెన్నై జట్లు తలపడ్డాయి. టాస్ నెగ్గిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. జట్టు స్కోరు 8 పరుగుల వద్ద అజింక్యా రహానే రూపంలో చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 60 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర (21) ధాటిగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. ఇక అప్పుడు మొదలైంది చెన్నై జోరు. అగ్నికి ఆజ్యం తోడైనట్టు రుతురాజ్ గైక్వాడ్(69), శివం దూబే (66) జత కలవడంతో చెన్నై జట్టు స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. వీరిద్దరూ కలిసి ఏకంగా మూడో వికెట్ కు 90 పరుగులు జోడించారు. ఫలితంగా చెన్నై జట్టు స్కోరు 15 ఓవర్లకు 150 పరుగులకు చేరుకొంది. అప్పటికే చెన్నై పటిష్ట స్థితిలో ఉంది. జట్టు స్కోరు 150 పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన మిచెల్(17) ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మైదానంలోకి వచ్చిన చెన్నై మాజీ కెప్టెన్ ధోని తన సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం నాలుగు బంతుల్లో 20 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. . ఇందులో మూడు సిక్సర్లు ఉన్నాయి. ధోని చేసిన బ్యాటింగ్ మైదానంలో ప్రేక్షకులను అలరించింది. కేవలం నాలుగు బంతుల్లోనే 20 పరుగులు చేసిన ధోనిని అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వింటేజ్ ధోనిని చూసామని కితాబిస్తున్నారు.
ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు.. కోయేర్ట్జీ, శ్రేయస్ గోపాల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. 207 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 4.4 ఓవర్లలో 49 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (32), ఇషాన్ కిషన్(17) పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండగా.. కిషన్ నింపాదిగా ఆడుతున్నాడు. బ్యాటింగ్ కు సహకరించిన ఈ మైదానంపై వికెట్లు తీసేందుకు చెన్నై బౌలర్లు కష్టపడుతున్నారు. ఓపెనింగ్ జోడిని విడదీసేందుకు చెన్నై కెప్టెన్ బౌలింగ్లో పలు రకాల మార్పులకు శ్రీకారం చుట్టాడు.
DO NOT MISS
MSD Hat-trick of Sixes Wankhede going berserk
Sit back & enjoy the LEGEND spreading joy & beyond
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia #TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG
— IndianPremierLeague (@IPL) April 14, 2024