Bobby movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నట సింహం గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో బాలయ్య బాబు..ఈయన ప్రస్తుతం వరుస సినిమాలు చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ఆయన 108 సినిమాలను పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు 109వ సినిమా కోసం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఇది చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ సినిమాకోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని తీసుకోవడానికి పలువురు డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా బడా డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా కోసం పోటీ పడుతున్నారట..ప్రొడ్యూసర్స్ ఎంత అడిగితే అంత ఇవ్వడానికైన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ సినిమాను వదులుకోవడానికి మాత్రం ఇష్టపడడం లేదు. అందువల్లే ఈ సినిమా కోసం భారీ మొత్తంలో డబ్బులను కేటాయించి డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ముందుకు వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇక బాలయ్య బాబు లాంటి ఒక సీనియర్ హీరో సినిమాకి కూడా ఇంతలా పోటీ ఉంటుంది అంటే ఆయన తన సినిమాలతో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక బాబీకి ఉన్న మార్కెట్ కూడా చాలా ఎక్కువే కాబట్టి ఈ సినిమా ఈజీగా ఓపెనింగ్స్ కానీ, కలెక్షన్స్ గాని భారీగా వసూలు చేస్తాయనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాని తీసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్స్ రెడీగా ఉంటున్నారు.
ఈ సినిమాతో మరోసారి బాలయ్య బాబు తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇంక ఇప్పటికే వరుసగా మూడు సక్సెస్ అందుకున్న బాలయ్య ఈ సినిమాతో నాలుగోవ సక్సెస్ ను సాధించి తనకు తానే పోటీ అంటూ ముందుకు సాగబోతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా దసర కానుక గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలైతే జరుగుతున్నాయి…