KKR vs LSG : ఒక ఓవర్ లో పది బంతులా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అతన్ని..

అంతటి బాధ ఉన్నప్పటికీ 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ ను కూల్చేశాడు. ఇంతటి ఘనత ఉన్న సమర్ జోసెఫ్ ఐపీఎల్ ఆరంగేట్ర మ్యాచ్ లో ప్రతిభ చూపించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. "అలా బౌలింగ్ చేస్తున్నాడు.. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అతన్ని" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : April 14, 2024 11:35 pm

Shamar Joseph

Follow us on

KKR vs LSG : టి20 అంటే ఏంటి.. దూకుడుకు పర్యాయపదం.. వేగానికి నానార్థం. పొట్టి క్రికెట్లో ప్రతీ బంతి విలువైనదే. ప్రతీ పరుగు వెలకట్టలేనిదే. అలాంటప్పుడు బౌలింగ్ వేసే బౌలర్ కు భయం ఉండాలి. వేసే ప్రతి బంతిమీద నియంత్రణ ఉండాలి. బ్యాటర్ అడుగులను పసిగట్టి బంతిని సంధించాలి. అప్పుడే బౌలర్ విజయవంతమవుతాడు. బ్యాటర్లపై పై చేయి సాధిస్తాడు. అలా కాకుండా ఎలా పడితే అలా బౌలింగ్ చేస్తే.. అభాసుపాలవుతాడు అచ్చం ఈ బౌలర్ లా..

ఆదివారం సాయంత్రం కోల్ కతా, లక్నో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో కోల్ కతా జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వాస్తవానికి ఐపీఎల్ లో కోల్ కతా లక్నోపై ఈ స్థాయిలో విజయం సాధించడం ఇదే ప్రథమం. ఈ మ్యాచ్ లో సమష్టి వైఫల్యం వల్ల లక్నో జట్టు ఓడిపోయింది. 160 పరుగులకు మించిన లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. అన్నిటికీ మించి మూడో వికెట్ ను పడగొట్టలేక రికార్డు స్థాయిలో భాగస్వామ్యం నమోదయ్యేందుకు కారణమైంది. బ్యాటింగ్ లో కీలక ఆటగాళ్లు వెంట వెంటనే అవుటయ్యారు. ఈ దశలో కేఎల్ రాహుల్, పూరన్ వంటి వారు ఆడటంతో లక్నో జట్టు ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. లేకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది. కోల్ కతా చేజింగ్ చేస్తున్న సమయంలో లక్నో జట్టు తన పేలవమైన బౌలింగ్ తీరును బయటపెట్టుకుంది. ఆ జట్టు బౌలర్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం షమర్ జోసెఫ్ దారుణంగా బౌలింగ్ వేసి తన పరువు మాత్రమే కాదు, లక్నో పరువును కూడా గంగలో కలిపాడు.

ఇటీవల లక్నో జట్టు సరైన స్థాయిలో విజయాలు సాధించకపోవడంతో బౌలింగ్లో కీలక మార్పులు చేసింది. ఆ మార్పులను కోల్ కతా జట్టు తో జరిగిన మ్యాచ్ లో అమలులో పెట్టింది. అందులో భాగంగానే సమర్ జోసెఫ్ ను బౌలింగ్ స్క్వాడ్లోకి తీసుకుంది. అయితే అతడు దారుణంగా బౌలింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో పది బంతులు వేశాడు. ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్ లో జోసెఫ్ ఏకంగా ఆరు వైడ్లు వేయడం విశేషం. దీంతో కేఎల్ రాహుల్ వెంటనే అతడిని బౌలింగ్ నుంచి తప్పించాడు.. వాస్తవానికి జోసెఫ్ మంచి బౌలరే. బంతిని స్వింగ్ తిప్పడంలో నేర్పరి. కానీ అతడు కొత్త బంతిని నియంత్రించలేకపోయాడు. ఫలితంగా ఇతడి బౌలింగ్లో కోల్ కతా ఆటగాళ్లు భారీగా పరుగులు పిండుకున్నాడు.

షమర్ జోసెఫ్ భీకరమైన పేస్ బౌలర్. 2024 జనవరిలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కించుకున్నాడు. వెస్టిండీస్ పేస్ బౌలర్ ఓల్లీ పోప్, జోస్ హాజిల్ వుడ్ ను ఓడించి మరీ అతడు ఈ పురస్కారం దక్కించుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో అద్భుతంగా ఆడాడు. బ్రిస్బెన్ లోని గబ్బా మైదానంలో జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో అతడు 68 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు 27 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వెస్టిండీస్ జట్టుకు తొలి టెస్ట్ విజయాన్ని అందించాడు. వాస్తవానికి ఆ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్లో జోసెఫ్ గాయపడ్డాడు. ఆ గాయాన్ని, నొప్పిని భరించుకుంటూనే వీరోచితంగా ఆడాడు. అంతటి బాధ ఉన్నప్పటికీ 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ ను కూల్చేశాడు. ఇంతటి ఘనత ఉన్న సమర్ జోసెఫ్ ఐపీఎల్ ఆరంగేట్ర మ్యాచ్ లో ప్రతిభ చూపించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. “అలా బౌలింగ్ చేస్తున్నాడు.. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అతన్ని” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.