Arjun Tendulkar: పేరుకు సచిన్ టెండుల్కర్ కొడుకు అయినప్పటికీ అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు తన ప్రతిభను నిరూపించుకోలేదు. ఐపీఎల్ 2021 సీజన్లో తొలిసారి ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పటివరకు అతడు కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. వాస్తవానికి 2021లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరినప్పటికీ.. మైదానంలో అతడి ఆరంగేట్రం గత సీజన్లో జరిగింది.. ఎడమచేతి వాటంతో బౌలింగ్ వేసే అర్జున్ టెండూల్కర్ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ఆరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లో అతడు కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేసి 17 పరుగులు ఇచ్చాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన అర్జెంటు పండుగ 9.36 ఎకానమీతో మూడు వికెట్లు తీశాడు.
ఐపీఎల్ మాత్రమే కాదు ఈ ఏడాది రంజి సీజన్లోనూ అతడి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గోవా జట్టుకు ఆడిన అతడు 11 ఇన్నింగ్స్ ల్లో కేవలం 9 వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాటింగ్లో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 11 ఇన్నింగ్స్ లలో 23.45 సగటుతో 258 పరుగులు చేశాడు. చివరి లీగ్ మ్యాచ్లో గోవా తరఫున నాలుగు వికెట్లు తీశాడు. కీలకమైన పరుగులు కూడా తీశాడు. అయినప్పటికీ 7 మ్యాచ్లలో గోవా ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. ఐదు మ్యాచ్లు ఓడిపోయి, ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది.
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేడు అనే విమర్శ అర్జున్ పై ఉంది. అందువల్లే అతడు రిజర్వ్ బెంచుకు పరిమితమవుతున్నాడు. సచిన్ తెర వెనుక ప్రయత్నం వల్ల ముంబై జట్టు ప్రతిసారి తీసుకుంటోంది. ప్రతిభ చూపించుకోలేకపోవడంతో రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేస్తోంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అర్జున్ ముంబై జట్టుకు ఆడుతున్నాడు. ఇందులో భాగంగా ఫిట్నెస్ పై దృష్టిపెట్టాడు. తన సోదరి సారా టెండుల్కర్ తో కలిసి జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. జిమ్ లో కసరత్తుల అనంతరం.. సారా టెండూల్కర్ అద్దం ముందు ఫోటో తీస్తుండగా.. అర్జున్ ఫోజ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.