Rohit Sharma: రోహిత్‌కు కోపమొస్తే అంతే.. !

అంబానీల యాజమాన్యంంలోని ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీగా ఉన్న ఐపీఎల్‌ జట్టుకు రోహిత్‌ కెప్టెన్‌గా ఉన్నారు. ఐదుసార్లు టైటిల్‌ సాధించాడు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌కు ఆయన స్థానంలో హార్ధిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది మేనేజ్‌మెంట్‌.

Written By: Raj Shekar, Updated On : March 6, 2024 5:51 pm

Rohit Sharma

Follow us on

Rohit Sharma: రోహిత్‌ శర్మ.. టీమిండియా సారథి. మంగళవారం(మార్చి 5న) తిరిగి జట్టులో చేరాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు – ఐదో టెస్టు మధ్య ఎక్కువ విరామం లభించింది. దీంతో రెస్టు తీసుకున్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మరో టెస్టు జరగాల్సి ఉంది. తొలి టెస్టులో ఓడిన టీమిండియా తర్వాత విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీలో వరుస విజయాలతో 3–1 ఆధిక్యంలోకి వెళ్లింది. ధర్మశాలలో ఐదో టెస్టు జరగాల్సి ఉంది. మార్చి 7న ధర్మశాల మ్యాచ్‌ ఆరంభం కానుంది.

విరామంలో ఇలా..
ఇక నాలుగో టెస్టు, ఐదో టెస్టు మధ్య చాలా విరామం దొరకడంతో కెప్టెన్‌ రోహిత్‌శర్మ బిలియనీర్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌–నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ–రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు తన భార్య రితికాతో కలిసి హాజరయ్యాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజులు జరిగిన వేడుకలు ముగియడంతో ఆదివారం రోహిత్‌ దంపతులు తిరుగు పయనమయ్యారు. జామ్‌నగర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే అభిమానులు, పాపరాజీలు హిట్‌మ్యాన్‌ను చుట్టుముట్టారు.

హిట్‌మ్యాన్‌కు కోపం వస్తుంది..
అప్పటికే అలసిపోయిన రోహిత్‌ ఫ్యాన్స్‌తో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. అయినా మరికొందరు క్యూ కట్టడంతో అక్కడున్నవాళ్లలో ఒకరు.. ‘ఇప్పుడు రోహిత్‌ భయ్యాకు కోపం వస్తుంది జాగ్రత్త’ అంటూ హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. హిట్‌ మ్యాన్‌ కోపం ఇదివరకు చూసిన వాళ్లే అయి ఉంటారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ముంబై ఇండియన్స్‌ సారథిగా..
అంబానీల యాజమాన్యంంలోని ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీగా ఉన్న ఐపీఎల్‌ జట్టుకు రోహిత్‌ కెప్టెన్‌గా ఉన్నారు. ఐదుసార్లు టైటిల్‌ సాధించాడు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌కు ఆయన స్థానంలో హార్ధిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది మేనేజ్‌మెంట్‌. ఫలితంగా రోహిత్‌ ఫ్యాన్స్‌ బాగా హర్ట్‌ అయ్యారని తెలుస్తోంది. అందుకే కొందరు రోహిత్‌కు కోపం వస్తుంది చూడండి అని అన్నట్లు తెలుస్తోంది.