https://oktelugu.com/

IPL 2022 Auction: మెగా వేలం వేళ ఫ్రాంచైజీల వ్యూహాలు.. హైదరాబాద్ టీమ్ ప్లేయర్స్ వీళ్లే..!

IPL 2022 Auction: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మెగా వేలానికి టైం దగ్గరకు వచ్చేస్తుంది. ఈ నెల 12, 13 తేదీల్లో కర్నాటక స్టేట్‌లోని బెంగళూరు వేదికగా వేలం జరగనుంది. ఇందుకు సంబంధించి వేలంలో ఉన్న క్రికెటర్స్ ఫైనల్ లిస్ట్ ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. 1,258 మంది ఆటగాళ్లు మెగా వేలానికి రిజిస్టర్ చేసుకోగా అందులో నుంచి బీసీసీఐ 590 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. ఈ క్రమంలోనే మెగా వేలానికి టైం దగ్గరకు […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 4, 2022 / 11:56 AM IST
    Follow us on

    IPL 2022 Auction: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మెగా వేలానికి టైం దగ్గరకు వచ్చేస్తుంది. ఈ నెల 12, 13 తేదీల్లో కర్నాటక స్టేట్‌లోని బెంగళూరు వేదికగా వేలం జరగనుంది. ఇందుకు సంబంధించి వేలంలో ఉన్న క్రికెటర్స్ ఫైనల్ లిస్ట్ ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. 1,258 మంది ఆటగాళ్లు మెగా వేలానికి రిజిస్టర్ చేసుకోగా అందులో నుంచి బీసీసీఐ 590 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. ఈ క్రమంలోనే మెగా వేలానికి టైం దగ్గరకు వచ్చేస్తున్న వేళ ఫ్రాంచైజీలన్నీ తమ వ్యూహాలను రచించుకుంటున్నాయి. ఏయే ఆటగాళ్లను తీసుకోవాలని, ఎంత ఖర్చు పెట్టాలనే లెక్కలేసుకుంటున్నాయి.

    IPL 2022 Auction

    ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లానింగ్ తోనే వేలం బరిలోకి దిగనుంది. గత సీజన్లలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూనే బలమైన కోర్ టీమ్‌ను ఎంచుకోవాలని డిసైడ్ అయింది. రిటెన్షన్ ప్రక్రియలో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు అన్ క్యాప్‌డ్ ప్లేయర్స్ ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌లను మాత్రమే తీసుకున్న ఆ జట్టు.. వేలంలో టీమిండియా యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌తో పాటు స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోవాలని భావిస్తుందట. మొత్తంగా ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ గట్టి ఆటగాళ్లనే టార్గెట్ చేసినట్లుంది.

    Also Read: ఉద్యోగుల సమ్మెను లెక్కచేయని జగన్.. ఇంకా బెదిరింపు ధోరణే..
    ఓపెనింగ్ స్లాట్ కోసంగాను సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో పాటు యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌‌ను తీసుకోవాలనుకుంటుంది. విదేశీ ప్లేయర్లలో మాజీ ప్లేయర్ బెయిర్ స్టోతో పాటు జాసన్ రాయ్‌లను తీసుకోవాలని అనుకుంటున్నది. వృద్దిమాన్ సాహాను కూడా బ్యాకప్ ఆప్షన్ అనుకుంటుందట. అయితే, మెగా వేలంలో శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టోలకు ఎవరూ ఊహించని రీతిలో భారీ ధర ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    ఈ ఇద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే సన్‌రైజర్స్‌కు చిక్కే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. కాగా, సన్‌రైజర్స్ టీమ్.. ఈ ఇద్దరి కోసం రూ.11 కోట్ల కంటే ఎక్కువ పెట్టే చాన్సెస్ లేవు. తెలుగు క్రికెటర్ రాయుడి కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.8 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. కాగా, రాయుడు కంపల్సరీగా హైదరాబాద్ టీమ్ కే వస్తాడని కొందరు అంటున్నారు కూడా. మొత్తంగా ఈసారి హైదరాబాద్ టీమ్ లో బెస్ట్ ప్లేయర్స్ ఉండే చాన్సెస్ ఉంటాయని టాక్.

    Also Read: సిరిసిల్ల‌లో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ భాగోతం

    Tags