https://oktelugu.com/

Ashok Galla: బాక్సాఫీస్ వద్ద జీరో అయ్యాడు. ఓటీటీలోనైనా ‘హీరో’ అవుతాడా ?

Ashok Galla: ‘అశోక్ గల్లా’ హీరోగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘హీరో’. ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు జయదేవ్ గల్లా కుమారుడిగా అలాగే, హీరో మహేష్ బాబు మేనల్లుడిగా అశోక్ గల్లా ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ ‘హీరో’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 11న డిస్నీ హాట్‌స్టార్‌లో సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 4, 2022 / 11:48 AM IST
    Follow us on

    Ashok Galla: ‘అశోక్ గల్లా’ హీరోగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘హీరో’. ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు జయదేవ్ గల్లా కుమారుడిగా అలాగే, హీరో మహేష్ బాబు మేనల్లుడిగా అశోక్ గల్లా ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ ‘హీరో’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 11న డిస్నీ హాట్‌స్టార్‌లో సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

    Ashok Galla

    శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. మొత్తానికి ఓటీటీలోకి ‘హీరో’ వచ్చేస్తున్నాడు. ఎలాగూ బాక్సాఫీస్ వద్ద ఈ హీరో జీరో అయ్యాడు. మరి ఓటీటీలోనైనా హీరో అనిపించుకుంటాడా ? చూడాలి.

    Also Read:  ఆ హీరో ఓ రోజంతా తనతో గడపమన్నాడు.. ప్రగతి షాకింగ్ కామెంట్స్..

    నిజానికి ఈ సంక్రాంతికి పెద్ద ఫ్యామిలీకి చెందిన వారసుడు ఎంట్రీ అంటూ ‘అశోక్ గల్లా’ ను ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు. అయితే, ఎంత హడావిడి చేసినా మనోడి యాక్టింగ్ లెవల్స్ లో మ్యాటర్ లేదు. అసలు సినిమా ప్రమోషన్స్ లో చూపించిన హడావుడి.. సినిమాలో చూపించి ఉంటే సినిమా హిట్ అయ్యి ఉండేది.

    Ashok galla

    అయినా విషయం లేకపోతే.. సూపర్‌ స్టార్ అల్లుడు,అయినా మెగాస్టార్ బావమరిది అయినా చూడరు. కాబట్టి.. వారసుల హీరోలుగా వచ్చే ముందు తమకున్న ప్రత్యేక అర్హత ఏమిటి అని ఆలోచించుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీలో నిలబడగలరు. లేకపోతే.. ఎప్పుడు హీరోగా వచ్చాడో.. ఎప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయాడో కూడా తెలియకుండా పోతుంది. ఇక నుంచు అయినా ‘అశోక్ గల్లా’ హీరోగా కష్టపడతాడేమో చూద్దాం.

    Also Read: అద్దె క‌ట్ట‌లేద‌ని ఇంట్లో నుంచి మాజీ ప్ర‌ధానిని గెంటేసిన ఓన‌ర్

    Tags