Ind Vs Sa 5th t20 Hardik Pandya: హార్దిక్ పాండ్యా టీమిండియాలో అద్భుతమైన ఆల్ రౌండర్. అతని బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కు వంక పెట్టాల్సిన అవకాశం లేదు. నెవర్ సీన్ షాట్లు ఆడటంలో అతడికి అతడే సాటి. కేవలం స్వదేశంలోనే కాదు, విదేశాలలో కూడా అతడు అదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడు. గత ఏడాది ఇదే సమయానికి దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టి20 సిరీస్లో అతడు ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజాగా మనదేశంలో జరిగిన టి20 సిరీస్లో దక్షిణాఫ్రికా జట్టుపై అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. హార్దిక్ పాండ్యా దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే అతడు ఈసారి మాత్రం శివతాండవం చేస్తున్నాడు. అంతర్జాతీయ మ్యాచులు ఐపీఎల్ మాదిరిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ల మీద ఏకచత్రాధిపత్యం సాగించిన తీరు తాజా ఉదాహరణ.. ఐదో టి20 మ్యాచ్లో అయితే అతడు 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. భీకరమైన బ్యాటర్ గా పేరుపొందిన అభిషేక్ శర్మ రికార్డును సైతం బద్దలు కొట్టాడంటే.. ఏ స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.
హాఫ్ సెంచరీ చేసిన తర్వాత హార్దిక్ పాండ్యా బ్యాట్ కు ముద్దు పెట్టాడు. ఆ తర్వాత మైదానంలో ఉన్న తన ప్రియురాలు మిహిక కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు ఆమెను పదే పదే చూపించడం మొదలుపెట్టారు. నటాషా తో విడాకులు తీసుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం ఇబ్బందుల్లో పడింది. ఇదే సమయంలో అతనిపై రకరకాల ఆరోపణలు వినిపించాయి. చాలామంది అతని జీవితంలోకి వచ్చారని ప్రచారం కూడా జరిగింది. చివరికి మిహిక తో అతడు సన్నిహితంగా కనిపించాడు. అంతేకాదు ఆమెతో తన బంధాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఆమె అతడి జీవితంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అంతేకాదు హార్దిక్ ఒక్కప్పటికంటే ఎక్కువగా ఆడుతున్నాడు. హార్దిక్ 2.0 అన్నట్టుగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
చివరికి 20 మ్యాచ్ లో ఐదు సిక్సర్లు కొట్టిన అతడు.. నెవెర్ సీన్ అన్నట్టుగా బ్యాటింగ్ చేశాడు. ఫోర్ల విషయంలో సైతం అతడు అలానే వ్యవహరించాడు. తద్వారా మైదానం మొత్తం హార్దిక్ నామస్మరణతో ఊగిపోయింది. అహ్మదాబాద్ కాస్త హార్దిక్ బాద్ అయింది. దీని అందరికి కారణం మిహికా అని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ” ఆమె అతడి జీవితంలోకి రావడంతో పరిస్థితి మారిపోయినట్టు కనిపిస్తోంది. అతడు ఉత్తుంగ తరంగం మాదిరిగా దూసుకుపోతున్నాడు.. మామూలుగా అయితే కాస్త నిదానత్వాన్ని అప్పుడప్పుడు ప్రదర్శించే హార్దిక్.. ఇప్పుడు దానిని పూర్తిగా మర్చిపోయాడు.. టి20లో రాకెట్ తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడు. టి20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా కు ఇంతకు నుంచి కావాల్సిందే ఉందని” క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.