https://oktelugu.com/

SRH : హైదరాబాద్ నుంచి అతడు అవుట్.. బెంగళూరు తో తలపడే జట్టు ఇదే..

ఈ నేపథ్యంలో డూ ప్లెసిస్ సేనపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. దానిని తగ్గించుకోవాలంటే ఆ జట్టుకు ఒక విజయం అనివార్యం. అటు రెండు విజయాలు సాధించిన హైదరాబాద్ జట్టు.. సోమవారం జరిగే మ్యాచ్ లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : April 14, 2024 / 09:09 PM IST
    Follow us on

    SRH : పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రెండు పరుగుల తేడాతో విజయం సాధించిన హైదరాబాద్ జట్టు.. మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సోమవారం బెంగళూరు జట్టుతో చిన్న స్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకొనుంది. ఇటీవల చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో గెలుపొందిన హైదరాబాద్.. ఆ తర్వాత పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ విజయం పై ఆ జట్టు కన్నేసింది. ఇప్పటికే ఆటగాళ్లు మైదానంలో ముమ్మరంగా సాధన చేస్తున్నారు. ఆటగాళ్ల సాధనకు సంబంధించిన వీడియోలను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తోంది. మరో విజయానికి హైదరాబాద్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారని రాసుకొచ్చింది.

    బెంగళూరు జట్టుతో జరిగే మ్యాచ్లో హైదరాబాద్ కీలక మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. పంజాబ్ జట్టుతో ఆడిన జట్టును కొనసాగిస్తూనే.. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డికి ప్రమోషన్ ఇచ్చింది. పంజాబ్ జట్టుపై అతడు ఏ స్థానంలో అయితే బ్యాటింగ్ కు వచ్చాడో.. బెంగళూరు తో జరిగే మ్యాచ్ లోనూ అదే స్థానంలో ఆడించాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించింది. బెంగళూరు మైదానం బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. పేస్ బౌలర్లకు సహకరిస్తుంది. అలాంటప్పుడు స్పిన్నర్ మార్కండే పై హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. అతడి స్థానంలో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

    ఇక బెంగళూరు ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఆ ఆటగాళ్లు స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన ఇవ్వడం లేదు. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇదివరకు బెంగళూరు తర్వాత ఢిల్లీ ఉండేది. అయితే ఆ జట్టు ఇటీవల లక్నో జట్టుపై సంచలన విజయం సాధించిన నేపథ్యంలో బెంగళూరు అట్టడుగు స్థానానికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో డూ ప్లెసిస్ సేనపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. దానిని తగ్గించుకోవాలంటే ఆ జట్టుకు ఒక విజయం అనివార్యం. అటు రెండు విజయాలు సాధించిన హైదరాబాద్ జట్టు.. సోమవారం జరిగే మ్యాచ్ లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.