https://oktelugu.com/

KKR vs LSG : బాబోయ్ ఇదేం ఓటమి? మరీ ఇంత దారుణంగానా.. తలదించుకున్న కేఎల్ రాహుల్

కీలకమైన ఆటగాళ్లు వెంటవెంటనే అవుట్ అవుతున్నప్పటికీ కెప్టెన్ కేఎల్ రాహుల్ (39) దూకుడుగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. ఇదే వరుసలో ఆయుష్ బదోని, క్రునాల్ పాండ్యా వంటి వారు వెంట వెంటనే అవుట్ కావడంతో.. లక్నో ఒకానొక దశలో 17 ఓవర్లకు 126 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Written By:
  • NARESH
  • , Updated On : April 14, 2024 / 09:53 PM IST

    KKR vs LSG

    Follow us on

    KKR vs LSG : ఆడుతోంది అనామక జట్టుకాదు.. ఆడే ఆటగాళ్ళు మాములు వాళ్లు కాదు..అరి వీరభయంకరులు.. కానీ ఆలాంటి ఆటగాళ్లు తేలిపోయారు. ప్రత్యర్థి బౌలర్ల బంతులకు దాసోహమయ్యారు. వెంటవెంటనే వికెట్లు సమర్పించుకుని పసికూనల్లా పెవిలియన్ చేరారు. కనీసం పోరాడాలి, ప్రతిఘటించాలనే సోయి కూడా వారిలో లేకపోవడం విశేషం. పై ఉపోద్ఘాతం మొత్తం ఆదివారం సాయంత్రం కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు ప్రదర్శించిన ఆటతీరు గురించే.. ఇప్పటి వరకూ ఐపీఎల్ చరిత్రలో లేనివిధంగా లక్నో జట్టు ఓడిపోవడం విశేషం. ఈడెన్ గార్డెన్ లోజరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 161పరుగులు చేసింది. నికోలస్ పూరన్(45), కేఎల్ రాహుల్ (39) మాత్రమే పర్వాలేదనిపించారు. కోల్ కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టాడు.

    అనంతరం టార్గెట్ చేధించే క్రమంలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కోల్ కతా విజయాన్ని సాధించింది. కోల్ కతా ఓపెనర్ పిలిప్ సాల్ట్ (89 నాట్ ఔట్) అర్థ శతకంతో సత్తాచాటాడు. శ్రేయస్ అయ్యర్ (30 నాట్ ఔట్)రాణించడంతో కోల్ కతా చారిత్రక విజయం సాధించింది. కాగా, ఐపీఎల్ చరిత్రలో లక్నోపై కోల్ కతా విజయం సాధించడం ఇదే తొలిసారి. గతంలో ఆడిన మూడు మ్యాచ్ లలో కోల్ కతా ఓడిపోవడం విశేషం.

    టార్గెట్ చేధించే క్రమంలో కోల్ కతాకు శుభారంభం లభించలేదు. 42రన్స్ కే రెండు వికెట్లు పోగొట్టుకుంది. నరైన్(6), రఘువన్షి(7)ను మోహిన్ ఖాన్ ఔట్ చేశాడు. ఈ దశలో అయ్యర్, సాల్ట్ కోల్ కతా ను తిరుగులేని స్థాయిలో నిలిపారు. ముఖ్యంగా లక్నో బౌలర్ షామార్ జోసెఫ్ బౌలింగ్లో ఏకంగా 22 పరుగులను సాల్ట్ సాధించాడు. అనంతరం అయ్యర్ కూడా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ దశలో జోరుగా ఆడిన సాల్ట్ 26 బంతుల్లోనే అర్థ శతకం పూర్తిచేశాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్లో బౌండరీ కొట్టి విజయ లాంచనాన్ని పూర్తి చేశాడు..

    ఈ మ్యాచ్ లో టాస్ ఓడి లక్నో జట్టు బ్యాటింగ్ కు దిగింది. అయితే ఆ జట్టుకు ఆశించినంత స్థాయిలో శుభారంభం దక్కలేదు. ఆ జట్టు ఆటగాడు డికాక్ కేవలం పది పరుగులు మాత్రమే చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అనంతరం దీపక్ హుడా కూడా చేసి స్టార్క్ బౌలింగ్లో రమణ్ దీప్ పట్టిన క్యాచ్ తో వెనుతిరిగాడు. కీలకమైన ఆటగాళ్లు వెంటవెంటనే అవుట్ అవుతున్నప్పటికీ కెప్టెన్ కేఎల్ రాహుల్ (39) దూకుడుగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. ఇదే వరుసలో ఆయుష్ బదోని, క్రునాల్ పాండ్యా వంటి వారు వెంట వెంటనే అవుట్ కావడంతో.. లక్నో ఒకానొక దశలో 17 ఓవర్లకు 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో పూరన్ చెలరేగి ఆడటంతో 161 రన్స్ చేసింది. ఈ లక్ష్యాన్ని కోల్ కతా ఆడుతూ పాడుతూ ఛేదించింది. 8 వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది.