Homeక్రీడలుక్రికెట్‌Sanjay Bangar Son Transition: మాజీ క్రికెటర్ కొడుకు అమ్మాయిగా మారిపోయాడు.. వెలుగులోకి మరో నిజం!

Sanjay Bangar Son Transition: మాజీ క్రికెటర్ కొడుకు అమ్మాయిగా మారిపోయాడు.. వెలుగులోకి మరో నిజం!

Sanjay Bangar Son Transition: టీమ్ ఇండియాలో సంజయ్ బంగర్ అనే క్రికెటర్ గతంలో ఆడాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవాడు. కొంతకాలం తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. సంజయ్ బంగర్ క్రికెట్ ఆడుతున్నప్పుడు అంతగా మీడియాలో కనిపించేవాడు కాదు. అయితే కొంతకాలంగా అతని పేరు మీడియాలో మారుమోగిపోతోంది.

సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకున్నాడు. ఫలితంగా అతడు అనయ బంగర్ గా మారిపోయాడు. వచ్చే నెలలో అతడు బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాడు. అక్కడ వాజినో ప్లాస్టి సర్జరీ చేయించుకోబోతున్నాడు. ఆ సర్జరీ ప్రకారం అతడి జననాంగాన్ని మారుస్తారు. ఆస్థానంలో స్త్రీ అవయవాన్ని ఏర్పాటు చేస్తారు. అతడు కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల వరకు సమయం పడుతుంది. అలాగే ప్రతి ఏడాది డాక్టర్ తో చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ కు దాదాపు 3 నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఆర్యన్ ముంబై, ఇంగ్లాండ్ లోని హింక్లీ క్రికెట్ క్లబ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. స్త్రీగా మారిన నేపథ్యంలో మహిళా క్రికెట్ జట్టులో అవకాశం కోసం ప్రయత్నాలు చేశారు. ఐసీసీ నిబంధనల ప్రకారం యుక్త వయసు దాటిన మహిళలకు ఉమెన్స్ క్రికెట్ ఆడేందుకు అవకాశం లేదు…

ఆర్యన్ మొదట్లో బాగానే ఉండేవాడు. ఆ తర్వాత అతడి శరీరంలో మార్పులు వచ్చాయి. అతడి గొంతు పూర్తిగా సన్నగా మారిపోయింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్తే మొదట్లో వారు నమ్మలేదు. తర్వాత ఆర్యన్ తనలో మగ లక్షణాలు లేవని ఒక అంచనాకు వచ్చాడు. ఆ తర్వాత ఆడవారి మాదిరిగా తయారయ్యేవాడు. మొదట్లో ఇది కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా అనిపించేది. ఆ తర్వాత వారు కూడా ఆర్యన్ ఇష్టాన్ని కాదనలేక.. అతడికి నచ్చినట్టు ఉండే విధంగా స్వేచ్ఛ ఇచ్చారు.

ప్రారంభంలో ఆర్యన్ కు కుటుంబం నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు కుటుంబం ఆర్యన్ కు సపోర్ట్ గా ఉంది. సోదరుడు అధర్వ నుంచి కూడా ఆమెకు మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం ఆర్యన్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా తన ప్రయాణాన్ని వివరిస్తున్నాడు. ట్రాన్స్ జెండర్ క్రీడాకారుల హక్కుల కోసం పోరాడుతున్నాడు. ఇంస్టాగ్రామ్ లో ఆర్యన్ బంగర్ అలియాస్ అనయ బంగర్ ను 8.59 లక్షల మంది అనుసరిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version