Homeఆధ్యాత్మికంToday 22 February 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఆకస్మిక ధన పండుగ..

Today 22 February 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఆకస్మిక ధన పండుగ..

Today 22 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై అశ్వినీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు ఆకస్మిక ధన పండుగ అయ్యే అవకాశం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షలో పాల్గొంటారు. తల్లిదండ్రులు పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త ఒప్పందాలు చేసుకోవడంలో వ్యాపారులు బిజీగా ఉంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దీంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): మీ రాశి వారు ఈ రోజు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులకు పూర్తి చేయడంతో ఉద్యోగులు సంతృప్తిగా ఉంటారు. పూర్వికుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. సమాజంలో గౌరవం ఉండడంతో మర్యాదలు దక్కుతాయి. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి కోరుకున్న వస్తువులను కొనుగోలు చేస్తారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు రాజకీయ నాయకులు అయితే ఈరోజు వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోగలుగుతారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పెద్దల సలహాతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సందడిగా మారుతుంది. ఇంట్లో జరిగే శుభకార్యానికి చుట్టాలు అధికంగా వస్తారు. వ్యాపారులు బిజీ షెడ్యూల్ కారణంగా కొన్ని పనులు పెండింగ్లో పడతాయి. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాపారులు అధికంగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు అదనపు ఆదాయాన్ని పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థుల పోటీ పరీక్షలకు తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. వ్యాపారులు కొత్త వ్యక్తులను కలుస్తారు. వీరితో కొత్త ఒప్పందాలు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికపరమైన కష్టాలను ఎదుర్కొంటారు. ఇతరుల వద్ద ధన సహాయం తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరం.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏ చిన్న నిర్లక్ష్యం వహించిన అధికంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. పిల్లల కెరీర్ పైకి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. వీరికి పెద్దల మద్దతు ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version