Nara Bhuvaneswari Assets: ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) భార్య భువనేశ్వరి ఒక్కరోజు ఆదాయం అక్షరాల రూ. 78.80 కోట్లు. మీరు చదివింది నిజమే. అదేదో అక్రమ మార్గంలో సంపాదించినది అనుకుంటే మీరు పొరబడినట్టే. ఆమె హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా ఈ ఘనత సాధించారు. హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించి షేర్ల విలువ భారీగా పెరగడంతో ఒక్కరోజే కోట్లాది రూపాయల ఆదాయం సమకూరింది. నారా భువనేశ్వరి ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం నారా బ్రాహ్మణి ఆ బాధ్యతలను చూస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తో పాటు హెరిటేజ్ సేవా విభాగాలకు సంబంధించిన సేవలను మాత్రమే నారా భువనేశ్వరి నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో హెరిటేజ్ ఫుడ్స్ పేరిట ఆమె షేర్ మార్కెట్లో డిపాజిట్లు చేయగా.. ఒకేసారి ఏడు శాతానికి పెరగడంతో రూ.78.80 కోట్ల ఆదాయం ఒక్కరోజే వచ్చింది.
కంపెనీలో కీలక భాగస్వామ్యం..
1992లో హెరిటేజ్ ఫుడ్స్ ను( Heritage foods ) ఏర్పాటు చేశారు చంద్రబాబు. అయితే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆ బాధ్యతలను భార్య భువనేశ్వరికి అప్పగించారు. ఆమె చిత్తశుద్ధితో తన విధులు నిర్వహిస్తూ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. డైరీ రంగంలో హెరిటేజ్ ను అగ్రగామిగా నిలిపారు. హెరిటేజ్ ఫుడ్స్ పేరిట పాల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించి హెరిటేజ్ సంస్థను అగ్రస్థానంలో నిలిపారు నిలిపారు. ప్రస్తుతం నిర్వహణ బాధ్యతలన్నీ బ్రాహ్మణి చూస్తున్నారు. కానీ ఎండిగా మాత్రం భువనేశ్వరి కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు నారా లోకేష్ కు సైతం ఇందులో వాటా ఉంది. దక్షిణ భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ కంపెనీ తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. రోజుకు 28.7 లక్షల లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేయగల సామర్థ్యం ఈ కంపెనీకి ఉంది. ఈ కంపెనీలో 418 రకాల డైరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. డైరీ తో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ, ఆహార ఉత్పత్తుల రంగంలో కూడా ఈ వ్యాపారాలను విస్తరించారు.
లాభాలలో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు..
అయితే నిన్ననే స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఏడు శాతానికి పైగా లాభంతో ముగిసింది. దీంతో నారా భువనేశ్వరి( bhuvneshwari ) వాటా విలువ గణనీయంగా పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టంతో ముగియగా.. హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు మాత్రం లాభాలను ఆర్జించాయి. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న భువనేశ్వరి కంపెనీలో 24.37% వాటా తో.. 2,26,11,525 షేర్లు కలిగి ఉన్నారు. దీంతో ఈ షేర్ల విలువ ఒక్కసారిగా పెరగడంతో రికార్డ్ స్థాయిలో ఒక్క రోజే రూ. 78.80 కోట్ల ఆదాయం సమకూరింది.