https://oktelugu.com/

T20 Women’s World cup  : టీమిండియా పాలిట విలన్ గా పాకిస్తాన్.. సెమీస్ వెళ్లకుండా మ్యాచ్ ఫిక్సింగ్.. వెలుగులోకి సంచలన వీడియో

టి20 ప్రపంచ కప్ లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి ద్వారా పాకిస్తాన్ తో పాటు టీమ్ ఇండియా కూడా గ్రూప్ దశలోనే స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కనుక గెలిచి ఉంటే టీమిండియా కు సెమీస్ వెళ్లడానికి అవకాశం ఉండేది. 

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 15, 2024 / 12:30 PM IST

    T20 Women's World cup 

    Follow us on

    T20 Women’s World cup  :  న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 110 పరుగులు చేసింది. ఈ టార్గెట్ ను చేజ్ చేయలేక పాకిస్తాన్ జట్టు 56 పరుగులకు కుప్పకూలింది. దీంతో న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్ వెళ్ళింది. గ్రూప్ – ఏ లో ఆస్ట్రేలియా తర్వాత రెండవ జట్టుగా సెమీ ఫైనల్ చేరుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓపెనర్ సుజి బేట్స్ 28 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. హాలిడే 22 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో నష్రా మూడు వికెట్లు పడగొట్టింది. ఒమైమా, నిదా, సదియా తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. న్యూజిలాండ్ విధించిన 11 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేదించలేకపోయింది. స్వల్ప స్కోర్ అయినప్పటికీ పాకిస్తాన్ జట్టు నిర్లక్ష్యం గా ఆడింది. మ్యాచ్ గెలవాలనే తాపత్రయం ఏ ఒక ప్లేయర్ లోనూ కనిపించలేదు. దీంతో పాకిస్తాన్ జట్టు 11.4 ఓవర్లలోనే 56 పరుగులకు ఆల్ అవుట్ అయింది. పాకిస్తాన్ ఆటగాళ్లలో కెప్టెన్ ఫాతిమా 21 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. మరో ప్లేయర్ మునిబా 15 పరుగులు చేసింది. ఇక మిగతా వాళ్లంతా వెంట వెంటనే అవుట్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో అమేలీయ మూడు వికెట్లు సాధించింది. ఎడెన్ కార్సన్ రెండు వికెట్లు పడగొట్టింది.. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా న్యూజిలాండ్ సెమీఫైనల్ వెళ్ళింది. ఓటమి చెందడంతో పాకిస్తాన్ తో పాటు భారత్ కూడా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఒకవేళ పాకిస్తాన్ ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటే టీమిండియా సెమీస్ వెళ్లడానికి అవకాశం ఉండేది. కానీ పాకిస్తాన్ జట్టు ఆ స్థాయిలో పోరాడలేకపోయింది. దారుణమైన ఆట తీరు ప్రదర్శించి.. రికార్డు స్థాయిలో ఓటమి మూటగట్టుకుంది. టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టుకు ఇదే అత్యల్ప స్కోర్ కావడం విశేషం. స్థూలంగా రెండవ తక్కువ స్కోరు చేసిన జట్టుగా పాకిస్తాన్ జట్టు నిలిచింది..
    అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు ముందుగా బౌలింగ్ చేసింది. అయితే ఆ జట్టు ప్లేయర్లు భారత్ సెమీస్ వెళ్లకూడదనే తీరుగా ఆడినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ జట్టు ప్లేయర్లు ఏకంగా 8 క్యాచ్ లను నేలపాలు చేశారు. అయితే ఆ క్యాచ్ లు అత్యంత క్లిష్టమైనవి కాదు.. సులువుగానే అందుకోవచ్చు. కానీ చేతుల్లోకి వచ్చిన బంతులను కూడా వారు జారవిడిచారు. ఇక చేజింగ్ సమయంలోనూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. కేవలం 28 పరుగులకే సగం వికెట్లను కోల్పోయారు.. కేవలం నాలుగు పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లను పాకిస్తాన్ ప్లేయర్లు కోల్పోయారు. దీంతో భారత్ సెమిస్ వెళ్లకుండా ఉండడానికి పాకిస్తాన్ ప్లేయర్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని సోషల్ మీడియాలో ఆరోపణలు వినిపిస్తున్నాయి.