INDCH vs PAKCH Match: దేశం మీద ప్రేమ ఉన్నవారు.. దేశం కోసం ఏమైనా చేస్తారు. త్యాగాలకు సిద్ధపడతారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడరు. అటువంటి నిర్ణయాన్ని మన దేశ క్రికెటర్లు తీసుకున్నారు. తద్వారా దేశం కంటే తమకు ఏదీ ఎక్కువ కాదని.. దేశం కోసం ఆడతామని.. అలాగని దేశ భద్రత మీద దెబ్బ కొట్టిన వారి పై ఆడే ప్రసక్తి లేదని నిరూపించారు టీమ్ ఇండియా లెజెండ్స్.
Also Read: గౌతమ్ గంభీర్ ఉగ్రరూపం.. బిత్తర పోయిన పిచ్ క్యూరేటర్.. వైరల్ వీడియో
ప్రస్తుతం ఇంగ్లీష్ గడ్డ వేదికగా ప్రపంచ ఛాంపియన్షిప్ లెజెండ్స్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీ నుంచి టీమిండియా బయటికి వచ్చేసింది. బర్మింగ్ హమ్ ప్రాంతంలోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా జూలై 31న భారత్ పాకిస్తాన్ మధ్య తేరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ రద్దయింది.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుతో ఆడేది లేదని లెజెండ్ క్రికెటర్లు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే టోర్నీ నుంచి బయటికి వచ్చేసారు. అంతేకాదు భవిష్యత్తు టోర్నీలో కూడా ఆడబోమంటూ సంకేతాలు ఇచ్చారు.
ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. పహల్గాం దాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కారణమని భారత్ పదేపదే చెబుతుండడం.. ఇటీవల ఉగ్రవాదులను మన భద్రతా దళాలు ఏరి వేయడం.. వంటి పరిణామాల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ దేశంతో టోర్నీ లో భాగంగా మ్యాచ్ ఆడేందుకు నిరాకరించింది. ఫలితంగా టోర్నీ నుంచి భారత్ వెళ్లిపోయింది. టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించిన నేపథ్యంలో పాకిస్తాన్ అధికారికంగా ఫైనల్ వెళ్లిపోయింది. ఇప్పుడు మాత్రమే కాదు లీగ్ దశలో కూడా భారత్ పాకిస్తాన్ జట్టుతో ఆడలేదు..
Also Read: పంత్ ప్లేస్ లో జగదీశన్.. అతడి రికార్డులు ఎలా ఉన్నాయో తెలుసా?
భారత లెజెండ్స్ జట్టుకు యువరాజ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. తద్వారా పాయింట్లు పట్టికలో నాలుగో స్థానాన్ని సాధించింది. సౌత్ ఆఫ్రికా, కంగారు జట్ల మధ్య ఆగస్టు 2న సెమి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతుంది. మరోవైపు భారత్ పాకిస్తాన్ సెమిస్ మ్యాచ్ కు సంబంధించి స్పాన్సర్ నుంచి వై దొలుగుతున్నట్టు ఇస్ మై ట్రిప్ పేర్కొంది. ఈ టోర్నీకి ఆ కంపెనీ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది.