Sreeleela: బాలీవుడ్ వాళ్ళకి భారీ షాక్ ఇచ్చిన శ్రీలీల… అట్లుంటది మరి తెలుగు హీరోయిన్ అంటే…

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ల సినిమాలు సక్సెస్ కావాలంటే మన హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, హీరోయిన్స్ కానీ వాళ్ల సినిమాల్లో నటించాలి అనే స్థాయి కి పడిపోయారు..

Written By: Gopi, Updated On : August 2, 2024 11:25 am

Sreeleela

Follow us on

Sreeleela: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు పొందిన వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక అందులో ‘శ్రీలీల’ ఒకరు. రాఘవేంద్రరావు సమర్పణ లో శ్రీకాంత్ కొడుకు అయిన రోషన్ ను హీరోగా పెట్టి తీసిన ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరితో నటిస్తుంది. ఇక రవితేజ హీరోగా వచ్చిన ‘ధమాకా’ సినిమా సక్సెస్ సాధించడంతో స్టార్ హీరోలందరూ వాళ్ల సినిమాలో శ్రీలీల నే హీరోయిన్ గా తీసుకోవాలి అంటూ ఫిక్సయినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ సినిమా తర్వాత శ్రీలీలా కి మధ్యలో కొన్ని ప్లాప్స్ వచ్చినప్పటికీ ప్రస్తుతం ఇప్పటికీ ఆమె టాప్ హీరోలందరితో నటించే అవకాశాలను అందుకుంటుంది. ఇక మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘ గుంటూరు కారం ‘ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే అందించలేదు. కాబట్టి ఆ సమయంలో ఆమె క్రేజ్ కొద్దిగా తగ్గింది. అయినప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ‘ ఉస్తాద్ భగత్ సింగ్’ ,నితిన్ తో ‘రాబిన్ హుడ్ ‘ రవితేజ తో మరొక సినిమా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ చాలా వరకు బిజీగా ఉంది. అయినప్పటికీ ఈమెకు ప్రస్తుతం బాలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫర్లైతే వస్తున్నాయి…

ఇక ఇప్పటికే బాలీవుడ్ లో ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమాను చేస్తున్న శ్రీలీల వరుణ్ ధావన్ హీరోగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలైతే వస్తున్నాయి. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి శ్రీలీలా తప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో నటిస్తున్న ఈ నటి ఇప్పుడున్న బిజీ వల్ల హిందీ సినిమాకి డేట్స్ అజెస్ట్ కావడం లేదనే ఉద్దేశ్యంతోనే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమా యూనిట్ మాత్రం హీరోయిన్ లేకుండా ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేశారట.

ఇక ఇప్పుడు ఏ హీరోయిన్ ని తీసుకుంటున్నారు అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు. ఇక రీసెంట్ గా ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన రమేష్ తురాని మాట్లాడుతూ మేము ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఏ హీరోయిన్ ని కూడా కన్ఫర్మ్ చేయలేదని హీరోయిన్ లేకుండానే మా ప్రణాళిక ప్రకారం మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేశామని చెప్పాడు. కానీ ఈయన గత కొద్దిరోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో మా సినిమాలో హీరోయిన గా శ్రీలీల ని తీసుకోవాలని అనుకుంటున్నాం అంటూ చెప్పాడు.

కానీ ఆయనే ఇప్పుడు మాత్రం శ్రీలీల ని అసలు మేము హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోలేదనే విధంగా మాట్లాడుతున్నాడు… ఇక ప్రస్తుతం వీళ్ళు బాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ హీరోయిన్ వీళ్ళకు ఎస్ చెప్తుందా లేదంటే మరొక హీరోయిన్ కోసం వెతుకుతారా అనే విషయాలైతే తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే తెలుగు స్టార్ హీరోయిన్ అయిన శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ మేకర్స్ కి షాక్ ఇచ్చిందనే చెప్పాలి…