spot_img
Homeక్రీడలుక్రికెట్‌Lucknow vs Delhi IPL 2026: లక్నో వర్సెస్ ఢిల్లీ: ఆ సూపర్ ఫాస్ట్ బౌలర్...

Lucknow vs Delhi IPL 2026: లక్నో వర్సెస్ ఢిల్లీ: ఆ సూపర్ ఫాస్ట్ బౌలర్ పైనే అందరి దృష్టి

Lucknow vs Delhi IPL 2026: ఐపీఎల్ లో భాగంగా బుధవారం లక్నో, ఢిల్లీ జట్లు పోటీ పడబోతున్నాయి..ఈ క్రమంలో రెండు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ ముమ్మరంగా చేపట్టారు. ఈ రెండు జట్లలో యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. భీకరమైన ఫారిన్ ప్లేయర్లు ఉన్నారు. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోటీ ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది.

మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి సూపర్ బౌలర్ మీద కేంద్రీకృతమై ఉంది. అతడి పేరే మయాంక్ యాదవ్. గాయం వల్ల అతడు చాలా రోజులుగా క్రికెట్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సీజన్లో ఐపీఎల్లో ప్రవేశించాడు. వేగవంతమైన బౌలర్గా పేరుపొందిన అతడు తొలి మ్యాచ్ ఆడేది అనుమానం గానే ఉంది.. అయితే దీనిపై లక్నో కోచ్ లాంగర్ స్పందించాడు. మయాంక్ మాత్రమే కాకుండా నమన్ తివారి కూడా సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నాడు.. ” మా జట్టులో బౌలింగ్ పరంగా ఇబ్బంది లేదు. మయాంక్ రెడీగా ఉన్నాడు. తివారి కూడా సిద్ధంగా ఉన్నాడు. యంగ్ పేసర్లు సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నారు. మోసిన్ ఖాన్, షమి, ఆకాష్, నోకియా వంటి బౌలర్ల సేవలు జట్టుకు దూరమైపోతున్నాయి. అర్జున్ టెండూల్కర్ రూపంలో ఆల్ రౌండర్ సిద్ధంగా ఉన్నాడు. వీరిలో ఎవరు తుది జట్టులో చోటు సంపాదిస్తారనేది చూడాల్సి ఉందని” మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరోవైపు లక్నోతో మ్యాచ్ కోసం తాను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ప్లేయర్లు పేర్కొన్నారు. తమ జట్టు మొత్తం మ్యాచ్ కోసం ఆసక్తిగా చూస్తోందని వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీ జట్టు ప్లేయర్లు రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడారు. అందులో అందరు కూడా సమర్థవంతంగా రాణించారు. ఈ నేపథ్యంలో లక్నో జట్టుతో ఎప్పుడు పోటీ జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మైదానంలో గత మూడు మ్యాచ్లలో హోమ్ టీం లే గెలిచాయి. లక్నో నుంచి గట్టి పోటీ ఉంటుందని ఢిల్లీ జట్టు భావిస్తోంది. బౌలింగ్ యూనిట్ ఇప్పటికే పలు పర్యాయాలు చర్చలు జరిపింది. పక్కా ప్రణాళికలు కూడా రూపొందించింది.. మార్క్రం, మిచెల్ మార్ష్, అద్భుతమైన ఫామ్ లో ఉండడంతో.. ఢిల్లీ జట్టు భారీ స్కోరు చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

మాయాంక్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ వేస్తాడు. బంతి పై పూర్తిస్థాయిలో నియంత్రణ కలిగి ఉంటాడు. వికెట్లు తీయడం మాత్రమే కాకుండా.. పరుగులను కట్టడి చేయడంలో అతడు సిద్ధహస్తుడు. అందువల్లే అతడి రాక కోసం లక్నో జట్టు కళ్ళు కాయలుకాచే విధంగా ఎదురు చూసింది. ఇప్పుడు అతడు జట్టులోకి రావడంతో.. ప్రత్యర్థి ఢిల్లీ జట్టుకు చుక్కలు తప్పవని భావిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular