Lucknow Super Giants: 2024లో కేఎల్ రాహుల్ ఏ ముహూర్తానయితే లక్నో జట్టు నుంచి వెళ్లిపోయాడో.. అప్పటినుంచి ఆ జట్టు చుట్టూ దరిద్రం వైఫై లాగా తిరుగుతూ ఉన్నట్టు కనిపిస్తోంది. కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ ను సారధిగా నియమించింది లక్నో యాజమాన్యం. కానీ అతడు అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఆటగాడిగా విఫలమవుతున్నాడు. నాయకుడిగా కూడా విఫలమవుతున్నాడు.
పంత్ సారధ్యంలో లక్నో జట్టు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పాయింట్లు పరంగా దిగువ స్థానంలో ఉంది.. ఆదివారం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. సూపర్ ఓవర్ లో లక్నో జట్టు కేవలం ఒకే ఒక పరుగు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అత్యత రికార్డు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కేకేఆర్ కు ఇది ఐదవ టై మ్యాచ్. లక్నోకు మాత్రం మొదటిది. ఐపీఎల్ లో చివరి బంతికి సిక్సర్ తో మ్యాచ్ టై కావడం ఇది రెండవసారి. గతంలో 2019లో వాంకడే లో ముంబై బౌలర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మనిషి పాండే సిక్సర్ కొట్టాడు. నాడు జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్లో ముంబై గెలిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు ఐదు టై మ్యాచ్లలో ఆడింది. రెండుసార్లు సూపర్ ఓవర్లో గెలిచింది. ఇందులో 2020లో అబుదాబిలో హైదరాబాద్ జట్టుపై కోల్ కతా గెలిచింది.
ఇక ఈ ఓటమి ద్వారా లక్నో జట్టు అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకుంది. 2013 నుంచి 2015 వరకు ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ (9 ఓటములు), 2008 నుంచి 2011 వరకు హైదరాబాదులో డెక్కన్ చార్జర్స్ (8 ఓటములు), 2025 నుంచి 26 వరకు లక్నోలో లక్నో జట్టు (8 ఓటములు), 2011 నుంచి 12 వరకు హైదరాబాదులో డెక్కన్ చార్జర్స్ (ఏడు ఓటములు), 2011 నుంచి 12 వరకు పూణేలో పూనే వారియర్స్ ఇండియా (ఏడు ఓటములు) జట్ల పేరుమీద ఓటమి రికార్డులు ఉన్నాయి.
ఐపీఎల్ లో లక్నో జట్టుకు అత్యంత సుదీర్ఘమైన ఓటమి పరంపర ఇది.. వరుసగా 5 ఓటములు ఎదుర్కోవడం లక్నో జట్టుకు ఇది తొలిసారి. ఐపీఎల్ చరిత్రలో లక్నో జట్టు ముందుగా బ్యాటింగ్ చేసిన 36 మ్యాచ్లలో 20 విజయాలను అందుకుంది. 15 ఓటములు సాధించింది. ఒకదాంట్లో ఫలితం తేలేదు. విజయాల శాతం 57.14 గా ఉంది. రెండోసారి బ్యాటింగ్ చేసిన 30 మ్యాచ్లలో 12 విజయాలు సాధించింది. 18 ఓటములు చవిచూసింది. ఇందులో విజయాల శాతం 40 ఉంది.
టి20 సూపర్ ఓవర్ లో సునీల్ అద్భుతమైన బౌలర్గా ఆవిర్భవించాడు. ఇతడు అనేక సందర్భాలలో 4.2 ఓవర్లు వేశాడు. 25 పరుగులు ఇచ్చాడు. ఆరు వికెట్లు సాధించాడు. ఇతడి ఎకానమీ రేటు 5.77.
సూపర్ ఓవర్లో పూరన్ కు గొప్ప రికార్డులు లేవు. అతడు ఐదుసార్లు సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేస్తే.. ఒక పరుగు మాత్రమే సాధించాడు. నాలుగు సార్లు 0 పరుగులకే అవుట్ అయ్యాడు.
కాగా, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్ లో ఒక పరుగు చేయడం ద్వారా లక్నో జట్టు చెత్త రికార్డు నమోదు చేసింది. 2020లో దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై పంజాబ్ రెండు పరుగులు చేసింది. ఈ రికార్డును కూడా బద్దలు కొట్టుకొని.. తన పేరు మీద చెత్త ఘనతను ఒక పరుగు చేసి లక్నో జట్టు లిఖించుకుంది.
