LSG Vs PBKS: ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా శనివారం పంజాబ్, లక్నో జట్లు అసలు సిసలైన టీ20 మజాను ప్రేక్షకులకు అందించాయి. సీటు చివరన కూర్చుని మ్యాచ్ చూసేలా చేశాయి. ఈ మ్యాచ్లో లక్నో జట్టు కెప్టెన్ రాహుల్ వైదొలిగాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా మైదానంలోకి అడుగుపెట్టాడు. అతడి స్థానంలో పూరన్ కెప్టెన్సీ బాధ్యతను చేపట్టాడు. ఇదే సంచలనం అనుకుంటే.. ఆ జట్టు నుంచి 21ఏళ్ళ కుర్రాడు మరింత సంచలనం నమోదు చేశాడు. శిఖర్ ధావన్ (గబ్బర్ సింగ్) కోటను కూల్చేశాడు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్ లో అతడి పరాక్రమం పంజాబ్ జట్టును ఓడించింది.
సొంత వేదికగా లక్నో జట్టు పంజాబ్ తో తలపడింది. లక్నో బౌలర్, 21 సంవత్సరాల మయాంక్ యాదవ్ బుల్లెట్ లాంటి బంతులు సంధించి మ్యాచ్ మొత్తాన్ని లక్నో వైపు మళ్ళించాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఎనిమిది టికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. డికాక్ (54; 38 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), కృణాల్ పాండ్యా(43*, 22 బంతుల్లో, నాలుగు ఫోర్లు, 2 సిక్సర్లు), పూరన్(42; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటాడు. అనంతరం లక్ష లక్ష్య సాధనలో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టపోయి ఈ 178 పరుగులు చేసింది.
200 పరుగుల భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగిన పంజాబ్ జట్టుకు బీభత్సమైన ఆరంభం లభించింది. ధావన్, బెయిర్ స్టో(42; 29 బంతుల్లో) మొదటి వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. వీరిద్దరి బ్యాటింగ్ ధాటికి 11.4 ఓవర్లలో పంజాబ్ 102 పరుగులు సాధించింది. ధావన్, బెయిర్ స్టో లక్నో బౌలర్లపై శివతాండవం చేశారు. పవర్ ప్లే లో ఏకంగా 61 పరుగులు పిండుకున్నారు. ఈ క్రమంలో ధావన్ 29 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు.
ఈ దశలో హాఫ్ సెంచరీ దిశగా వెళ్తున్న బెయిర్ స్టో ను మయాంక్ యాదవ్ బోల్తా కొట్టించాడు. తర్వాత ఓవర్లో ప్రభు తర్వాత ఓవర్లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ (19; ఏడు బంతుల్లో), కొంత సమయానికే జితేష్ శర్మ (6; 9 బంతుల్లో) అవుట్ చేసి లక్నో జట్టులో ఆశలు కల్పించాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి పంజాబ్ బ్యాటర్లను వెన్నులో వణుకు పుట్టించాడు. ఈ సీజన్ లో (155 కి.మీ/గ) వేగంతో బౌలింగ్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. మయాంక్ యాదవ్ తో పాటు మోహిన్స్ ఖాన్ కూడా బంతితో అద్భుతం చేశాడు. దీంతో లక్నో జట్టును పంజాబ్ కీలక సమయంలో ప్రతిఘటించలేకపోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో జట్టు అదిరిపోయే ఆరంభం దక్కలేదు. ఈ మ్యాచ్లో సారధ్య బాధ్యతల నుంచి వైదొలిగిన కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. అతడు 9 బంతుల్లో 15 పరుగులు చేసినప్పటికీ ఎక్కువసేపు మైదానంలో ఉండలేకపోయాడు..సిక్స్, ఫోర్ కొట్టి దూకుడు మీద ఉన్న అతడిని అర్ష దీప్ అవుట్ చేశాడు..దేవ దత్ పడిక్కల్(9; 6 బంతుల్లో), ను సామ్ కరన్, స్టోయినిస్(19; 12 బంతుల్లో) ను రాహుల్ చాహార్ అవుట్ చేశాడు.
ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన కెప్టెన్ పూరన్, డికాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దె ప్రయత్నం చేశారు. డికాక 34 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డికాక్- పూరన్ జోడి దూకుడుకు లక్నో 200కు మించి పరుగులు సాధించేలా కనిపించింది. కానీ బ్రేక్ అనంతరం 14వ ఓవర్లో డికాక్ ను ఆర్ష దీప్ అవుట్ చేశాడు. కొంతసేపటికి పూరన్ ను రబాడ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో లక్నో వేగం తగ్గింది. కాని చివర్లో క్రునాల్ పాండ్యా బ్యాట్ తో మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతడి బ్యాటింగ్ దూకుడు వల్లే పంజాబ్ జట్టు 199 పరుగులు చేసింది.