Dhirubhai Ambani International School: రిలయన్స్ గ్రూపు ద్వారా 2003లో స్థాపించిన ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, ఇది ఆసియాలోనే అతిపెద్ది. ఇది ఇంటర్నేషనల్ బాకలారియాట్ పాఠ్యాంశాలను అనుసరిస్తుంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందిస్తుంది. ఈ పాఠశాల ఫీజు నిర్మాణం కారణంగా సెలబ్రిటీ పిల్లలు మరియు సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులలో ప్రసిద్ధి చెందింది.
అత్యుత్తమ పాఠశాలగా..
రిలయన్స్ గ్రూపు ద్వారా 2003లో స్థాపించిన పాఠశాల వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ జ్ఞాపకార్థం ఈ పాఠశాలను 20 ఏళ్లలో అత్యుత్తమ పాఠశాలగా ఎదిగింది. ఇక పాఠశాల లక్ష్యం విద్యార్థులను ఆత్మవిశ్వాసం, బాధ్యత, దయగలవారిగా మార్చడం.
ఫీజులు ఇలా..
అంబానీ ఇంటర్షేనల్ స్కూల్‌లో ఫీజు నిర్మాణం పోటీగా ఉంటుంది. అందించిన సౌకర్యాలు మరియు సేవల ఆధారంగా మారుతూ ఉంటుంది. మీడియా నివేదిక ప్రకారం ఎల్‌కేజీ నుంచి ఉద్యోగులం కావడంతో ఎల్‌కేజీ నుంచి గ్రేడ్ 7 వరకు నెలవారీ ఫీజు రూ.1.7 లక్షలు. అంటే అందులో చదివే వీవీఐపీల పిల్లలు ఏడాదికి రూ.20 లక్షలు చెల్లించాలి. ఇక 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నెలవారీ ఫీజు రూ.5.9 లక్షలు. ఇక 11, 12వ తరగతి చదివే వారి నెలవారీ ఫీజు రూ.9.8 లక్షలు. ఇక ఈ పాఠశాలలో విద్యార్థులందరికీ ఆర్థిక పరిమితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్య అందుతోంది. స్కాలర్‌షిప్‌లు, ఆర్థికసాయాలు కూడా ఉంటాయి.
సౌకర్యాలు ఇలా..
ఇక అంబానీ స్కూల్ ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది. ఇందులో 60 గదులు ఉన్నాయి. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, డిజిటల్ గడియారాలు, డిస్‌ప్లే మరియు రైటింగ్ బోర్డులు, లాకర్‌లు, కస్టమ్–మేడ్ ఫర్నిచర్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్, మల్టీమీడియా సపోర్ట్ మరియు ఎయిర్ కండిషనింగ్‌లు ఉన్నాయి. విద్యాబోధనతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుంది. 2.3 ఎకరాల్లో మైదానం ఉంది. ఇందులో టెన్నిస్, బాస్కెట్‌బాల్ కోర్టులు ఉన్నాయి. ఇంకా విద్యార్థుల కోసం ఆర్ట్ రూమ్, లెరన్నింగ్ సెంటర్, యోగా రూం, సెర్ఫార్మింగ్ ఆర్ట్స్, మల్లీ మీడియా సెంటర్ అందిస్తుంది.
వీరి పిల్లలు అందులోనే..
టీమిండియా క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ, బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ తదితరుల పిల్లలందరూ ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లనే చదువుతున్నారు.