Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో చాలామంది అథ్లెట్లు ఆట ద్వారా ప్రతిభ చూపారు.. మెడల్స్ సాధించారు. వార్తల్లో వ్యక్తులయ్యారు. మీడియాలో ప్రధాన అంశాలుగా మారారు. అయితే ఈ జాబితాలో ఓ క్రీడాకారిణి ఏమాత్రం ప్రతిభ చూపకుండానే వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. మెడల్స్ సాధించిన ఆటగాళ్ల కంటే ఎక్కువ ఫేమ్ సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఆమె గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఇంతకీ ఆ క్రీడాకారిణి ఎవరు? అంత సంచలనం ఎందుకు అయింది? బరిలో దిగముందుకే క్రీడా గ్రామం నుంచి ఎందుకు బహిష్కరణకు గురైంది? ఇప్పుడు మళ్లీ ఎందుకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
పారిస్ ఒలంపిక్స్ కు నేడే ముగింపు రోజు. అయితే రెండు రోజుల క్రితం పారిస్ స్పోర్ట్స్ విలేజ్ నుంచి పరాగ్వే దేశానికి చెందిన స్విమ్మర్ లువానా అలోన్సో ను బయటికి పంపించారు. అయితే ఆమె తన ప్రవర్తనతో తోటి క్రీడాకారులను ఇబ్బందికి గురి చేసిందని అభియోగాలు మోపుతూ ఒలింపిక్స్ నిర్వాహకులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లువానా ఈత దుస్తులు ధరించి.. తమను కవ్వించిందని తోటి క్రీడాకారులు ఆరోపించారు. ఆమె వల్ల తాము ఈత మీద దృష్టిని కోల్పోతున్నామని మండిపడ్డారు. దీంతో ఒలింపిక్ నిర్వాహకులు ఆమెను స్పోర్ట్స్ విలేజ్ నుంచి బయటికి పంపించారు. ఈ వార్త బయటకు రావడంతో ఒక్కసారిగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది.
స్పోర్ట్స్ విలేజ్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత అలోన్సో సంచలన వ్యాఖ్యలు చేసింది. ” బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ నెయ్ మార్ జూనియర్ నాకు నేరుగా సందేశం పంపాడు. ఆ సందేశంలో ఏముందో మీకు ప్రత్యేకంగా నేను చెప్పలేను. అందులో ఏముందో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మీరు ఎలా ఊహించుకున్నా పర్వాలేదని” అలోన్సో పేర్కొంది.
అలోన్సో ఈ విషయం వెల్లడించడంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. దీంతో కొన్ని స్పోర్ట్స్ చానల్స్ నెయ్ మార్ వివరణ తీసుకోవడానికి ప్రయత్నించగా.. అతడు అందుబాటులోకి రాలేదు. మరోవైపు 20 సంవత్సరాల అలోన్సో ను ఒలింపిక్ నిర్వాహకులు స్పోర్ట్స్ విలేజ్ నుంచి అర్ధంతరంగా బయటికి పంపించారు. దీంతో ఆత్మ న్యూనతకు గురైంది. వెంటనే స్విమ్మింగ్ కు వీడ్కోలు పలికింది. ఈ నిర్ణయం ప్రకటించి అందర్నీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. తనకు అండగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. అయితే తనను ఎవరూ స్పోర్ట్స్ విలేజి నుంచి బయటికి పంపించలేదని, నిరాధారమైన వార్తలను ప్రసారం చేయకండి అంటూ విజ్ఞప్తి చేసింది. అలాంటి వార్తలు తనకు నిద్రలేని రాత్రులను పరిచయం చేస్తున్నాయని, నా వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా చూడాలని ఆమె విన్నవించింది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Luana alonso says former brazil football team captain ney mar jr sent me a direct message
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com