LSG vs PBKS : సరిగ్గా ఆదివారం నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. హైదరాబాద్ జట్టును వారి సొంత మైదానంలో ఓడించింది. ఐపీఎల్ 18 ఎడిషన్ లో తొలి మ్యాచ్ ను లక్నో జట్టు ఢిల్లీ జట్టుతో ఆడింది. ఒక వికెట్ తేడాతో ఓటమిపాలైంది. రెండో మ్యాచ్లో హైదరాబాద్ జట్టుతో తలపడి.. ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. కానీ సొంతమైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు ఓటమిపాలైంది. లక్నో జట్టు ఓడిపోయింది అనే దానికంటే.. చేతులారా తలవంచింది అని చెప్పడం సబబు. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో జట్టు పరుగుల వరద పారిస్తుందని అందరూ అనుకున్నారు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని అందరూ భావించారు. అని వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరిగింది.. పంజాబ్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్(Arshdeep Singh)(3/43) లక్నో జట్టు పతనాన్ని శాసించాడు. లక్నో జట్టులో పూరన్(44), ఆయుష్ బదోని (41) మాత్రమే ఆకట్టుకున్నారు. మిగతా వారంతా విఫలమయ్యారు. పూరన్, బదోని గనక ఆడక పోయి ఉంటే లక్నో జట్టు స్కోరు మరింత దారుణంగా ఉండేది.
Also Read : దీన్నే గెలికి తన్నించుకోవడం అంటారు..పాపం LSG బౌలర్
సుడిగాలి ఇన్నింగ్స్
172 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన పంజాబ్ జట్టు.. ప్రారంభం నుంచి లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. పిచ్ పై ఉన్న స్లో వికెట్ ను సద్వినియోగం చేసుకుంటూ పరుగుల వరద పారించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (8) త్వరగానే అవుట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ (69), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (52*) , నేహళ్ వదేరా(43*) దూకుడు కొనసాగించడంతో.. పంజాబ్ జట్టు 16.2 ఓవర్లలోనే టార్గెట్ చేజ్ చేసింది. మొత్తంగా 8 వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది.. ఈ గెలుపు ద్వారా పాయింట్ల పట్టికలో పంజాబ్ జట్టు రెండవ స్థానాన్ని ఆక్రమించింది.. ప్రియాన్ష్ ఆర్య అవుట్ అయిన తర్వాత… సిమ్రాన్ సింగ్, అయ్యర్ ఆకాశమేహద్దుగా చెలరేగిపోయారు. లక్నో బౌలర్ల పై ఏమాత్రం కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 44 బంతుల్లోనే 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.. లక్నో బౌలర్ల బౌలింగ్ ను ఏమాత్రం లెక్కచేయకుండా పరుగులు తీశారు. సిమ్రాన్ సింగ్ ఔటయ్యే నాటికే పంజాబ్ జట్టు విజయం ఖాయమైపోయింది.. నెహల్, శ్రేయస్ అయ్యర్ మూడో వికెట్ కు అజేయంగా 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో పంజాబ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఓపెనర్ సిమ్రాన్ సింగ్ చేసిన బ్యాటింగ్ లక్నో ఆటగాళ్లకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 34 బంతులు ఎదుర్కొన్న అతడు 9 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో ఏకంగా 69 పరుగులు చేశాడు. ఇక లక్నో బౌలర్లలో దిగ్వేష్ రెండు వికెట్లు పడగొట్టాడు.. అయితే ఈ మ్యాచ్ లో కూడా లక్నో జట్టు కెప్టెన్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడం విశేషం.
Also Read : బలాబలాలు, గెలిచేది ఏ జట్టంటే..