స్మిత్, మ్యాక్స్ వెల్, హర్భజన్ ఔట్.. ఐపీఎల్ లో దిగ్గజాలను వదులుకున్న జట్లు

ఐపీఎల్ 2021 సీజన్ పై బీసీసీఐ దృష్టిసారించింది. ఫిబ్రవరి మొదటి వారంలో మినీ వేలం నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే జనవరి 20వతేదీలోగా వేలం కోసం రిలీజ్ చేసే ఆటగాళ్లు, తమ జట్టులో ఉండే ఆటగాళ్ల ప్లేయర్స్ లిస్టును సిద్ధం చేయాలని ఫ్రాంచైజీలను బీసీసీఐ కోరింది. దీంతో టీంలన్నీ మంచి ప్లేయర్స్ ను అంటిపెట్టుకొని మిగతా వారిని వదిలేశాయి. Also Read: ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ఇదే! సన్ రైజర్స్ […]

Written By: NARESH, Updated On : January 21, 2021 7:27 pm
Follow us on

ఐపీఎల్ 2021 సీజన్ పై బీసీసీఐ దృష్టిసారించింది. ఫిబ్రవరి మొదటి వారంలో మినీ వేలం నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే జనవరి 20వతేదీలోగా వేలం కోసం రిలీజ్ చేసే ఆటగాళ్లు, తమ జట్టులో ఉండే ఆటగాళ్ల ప్లేయర్స్ లిస్టును సిద్ధం చేయాలని ఫ్రాంచైజీలను బీసీసీఐ కోరింది. దీంతో టీంలన్నీ మంచి ప్లేయర్స్ ను అంటిపెట్టుకొని మిగతా వారిని వదిలేశాయి.

Also Read: ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ఇదే!

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ వార్నర్, విలయంసన్, బెయిర్ స్టో, మిచెల్ మార్స్, హోల్డర్, రషీద్ ఖాన్ లను అంటిపెట్టుకుంది. మామూలు భారతీయ ఆటగాళ్లను మాత్రమే వదిలేసింది.

అయితే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్న స్మిత్ ను వదులుకొని సంచలనం సృష్టించింది.. ఐపీఎల్ 2021 సీజన్ కోసం కొత్త కెప్టెన్ గా సంజూ శాంసన్ ను రాజస్థాన్ నియమించింది. స్మిత్ కు తమ అధికారిక ట్విటర్ లో ధన్యవాదాలు తెలిపింది.

Also Read: వైరల్ వీడియో: డ్రెస్సింగ్ రూంలో టీమిండియా కోచ్ మాటలు

రాజస్థాన్ టీమ్ కు సేవలు అందించనందుకు ధన్యవాదాలు తెలిపింది. రాజస్థాన్ బ్యాటింగ్ లో సంజూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పితే మరింత బాధ్యతగా ఆడతాడని రాజస్థాన్ యజమాన్యం భావిస్తోంది.

2008 లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ 2018 లో స్టీవ్ స్మిత్ ను కెప్టెన్ గా నియమించింది. 2019లో స్మిత్ జట్టులోకి చేరినప్పటికీ కెప్టెన్ గా రహానే వ్యవహరించాడు. కానీ 2020 సీజన్ కు స్మిత్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఈ సీజన్ లో స్మిత్ సరిగా రాణించకపోవడంతో కెప్టెన్ మార్చాలనే డిమాండ్ వ్యక్తమైంది. దీంతో సంజూకు కెప్టెన్సీ దక్కింది.