LEO Messi : బర్త్ డే స్పెషల్ : చిన్నతనం నుండే హార్మోన్ లోపం ఉన్న మెస్సి..ప్రపంచ ఫుట్ బాల్ ఛాంపియన్ గా ఎలా ఎదిగాడు ?

బార్సిలోనా సీనియర్ జట్టులోకి మెస్సీ అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ ఆయన కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బార్సిలోనా తరుపున 778 మ్యాచులు ఆడయినా మెస్సీ, 672 గోల్స్ వేసి ఆల్ టైం టాప్ గోల్స్ వేసిన ఫుట్ బాల్ ప్లేయర్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Written By: NARESH, Updated On : June 24, 2023 8:18 pm
Follow us on

LEO Messi : ఫుట్ బాల్ క్రీడలో దిగ్గజం గా పేరు తెచ్చుకున్న లియోనల్ ఆండ్రు మెస్సీ కి మన ఇండియా లో కూడా ఒక రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అర్జెంటీనా తరుపున ప్రపంచం లో ఉన్న అన్నీ ఫార్మట్స్ లో అవార్డులను గెలుచుకొని చరిత్ర సృష్టించి అర్జెంటీనా దేశానికీ కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన దిగ్గజం ఆయన. తనకు మాత్రమే సాధ్యమైన ప్రత్యర్థులను బోల్తా కొట్టించే డ్రిబ్లింగ్ స్కిల్స్ మరియు వేగం మెస్సీ సొంతం. అంతర్జాతీయ స్థాయిలో 1028 క్లబ్ మ్యాచులు ఆడిన మెస్సీ 807 గోల్స్ ని సాధించి, అభిమానుల గుండెల్లో తనకి చెరిగిపోని ముద్రని వేసుకున్నాడు. ఇంతా అద్భుతంగా ఆడుతున్న తన అర్జెంటీనా దేశానికీ కప్పుని తీసుకొని రాలేకపోయానే అనే బాధ మెస్సీ లో ఒకప్పుడు ఉండేది. అయిపోతే గత ఏడాది జరిగిన ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ లో అది కూడా సాధించి చరిత్ర తిరగరాసిన మధుర క్షణాలను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.

అలాంటి దిగ్గజం పుట్టిన రోజు నేడు,కాబట్టి ఆయనకీ సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.

జననం/ ప్రస్థానం:

మెస్సీ 1983 వ సంవత్సరం జూన్ 24 వ తేదీన , అర్జెంటీనా లోని రోసారియా లో జన్మించాడు. పాపం ఆయనకు పదేళ్ల వయస్సులోనే గ్రోత్ హార్మోన్ సమస్య ఉండేది. ఆయన తండ్రి సంపాదించే డబ్బులు మొత్తం, మెస్సీ వైద్య ఖర్చులకే అయిపోయేది. అయితే చిన్నతనం నుండి మెస్సీ కి ఫుట్ బాల్ మీద ఉన్న మక్కువే ఆయనకీ ఉన్న గ్రోత్ హార్మోన్ సమస్య కూడా తొలగిపొయ్యెలా చేసింది. స్పెయిన్ లోని బార్సీలోనా క్లబ్ మ్యాచు లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినందుకు గాను , ఆ క్లబ్ మ్యానేజ్మెంట్ సభ్యులే మెస్సీ కి చికిసకు అయ్యే ఖర్చులను భరించడానికి ముందుకు వచ్చారు.

బార్సిలోనా లో చరిత్ర సృష్టించిన మెస్సీ :

బార్సిలోనా సీనియర్ జట్టులోకి మెస్సీ అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ ఆయన కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బార్సిలోనా తరుపున 778 మ్యాచులు ఆడయినా మెస్సీ, 672 గోల్స్ వేసి ఆల్ టైం టాప్ గోల్స్ వేసిన ఫుట్ బాల్ ప్లేయర్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

రికార్డ్స్ / టైటిల్స్ :

2014 వ సంవత్సరం లో ఎంతో ఉత్కంఠ గా జెర్మనీ మరియు అర్జెంటీనా కి మధ్య జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో తృటిలో ప్రపంచ కప్ ని అందుకునే అదృష్టాన్ని కోల్పోయిన అర్జెంటీనా టీం కి , 2022 వ సంవత్సరం లో అర్జెంటీనా దేశం చిరకాల కోరికను నెరవేరుస్తూ ప్రపంచ కప్ ని గెలిచి అర్జెంటీనా దేశానికీ బహుమతిగా ఇచ్చాడు. అంతే కాదు అత్యంత ప్రతిష్టాత్మక కోపా అమెరికా కప్ ని కూడా గెలుపొందాడు. యూరోప్ దేశం లో ప్రతిష్టాత్మా ఛాంపియన్ లీగ్ మ్యాచులు బార్సిలోనా తరుపున ఆది నాలుగు సార్లు టైటిల్ ని గెలుపొందాడు.

స్పెయిన్ ఫుట్ బాల్ లీగ్స్ అయినా లా లిగాను రికార్డు స్థాయిలో 10 సార్లు, అలాగే పారిస్ లీగ్ 1 ట్రోఫీలను ఆడిన రెండు సీజన్స్ లోనూ ఆయన గెలుపొందాడు. ఇక అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఇచ్చే డీ ఓర్ పురస్కారాన్ని 7 సార్లు గెలుచుకున్న లెజెండ్ ఆయన. అలాగే ఒక సీజన్ 95 మ్యాచులు ఆది గిన్నిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కాడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు. అలాంటి ఈ ఫుట్ బాల్ దిగ్గజం భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సాధించి అర్జెంటీనా దేశానికీ పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.