ధోని గుండుకు.. చెన్నై ఓటమికి లింకు.. నెట్టింట్లో పేలుతున్న జోక్స్..! 

  చెన్నై జట్టు ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లో గెలిచి ఐదింటిలో ఓడిపోయింది. చెన్నె జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. అతడు జట్టులో ఎన్ని మార్పులు.. వ్యూహాలు చేసినా ఫలించడం లేదు. దీంతో ధోని కెప్టెన్సీపై సైతం సగటు అభిమానుల్లో సందేహాలు కలుగుతున్నాయి. Also Read: మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటములపై నెట్టింట్లో మీమ్స్.. జోక్స్ పేలుతున్నాయి. […]

Written By: NARESH, Updated On : October 11, 2020 2:12 pm
Follow us on

 

చెన్నై జట్టు ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లో గెలిచి ఐదింటిలో ఓడిపోయింది. చెన్నె జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. అతడు జట్టులో ఎన్ని మార్పులు.. వ్యూహాలు చేసినా ఫలించడం లేదు. దీంతో ధోని కెప్టెన్సీపై సైతం సగటు అభిమానుల్లో సందేహాలు కలుగుతున్నాయి.

Also Read: మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు

దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటములపై నెట్టింట్లో మీమ్స్.. జోక్స్ పేలుతున్నాయి. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో ఆడిన మ్యాచులోనూ చెన్నె 37 పరుగులతో ఓటమిపాలైంది. బౌలింగులో అదరగొట్టిన చెన్నై.. చివరి నాలుగు ఓవర్లలో పరుగులు ధారళంగా ఇచ్చింది. దీంతో ఆర్సీబీ 170పరుగులు చేసింది.

170పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్ కు దిగిన చెన్నై టెస్టు క్రికెట్ ను తలపించేలా ఆడటం విమర్శలకు తావిచ్చింది. తొలి 5ఓవర్లలో వరుసగా 4, 2, 7, 6, 2 పరుగులతో 21 స్కోరే చేసింది. ఓపెనర్‌ డుప్లెసిస్‌ (8), వాట్సన్‌ (14) చేతులెత్తేశారు. 10ఓవర్లు ముగిసే చెన్నై స్కోరు 47/2. దీంతో చిర్రెత్తుకుపోయిన అభిమానులు ‘ఎవడ్రా టెస్ట్ క్రికెట్ కనుమరుగవుతుందని చెప్పింది.. డాడీస్ ఆర్మీ ఉన్నంత వరకు ఐపీఎల్‌లోనూ టెస్ట్ క్రికెట్ బతికే ఉంటుందంటూ’ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ మ్యాచులో ధోనీ పూర్తిగా గుండు చేసుకొని న్యూలుక్కులో కన్పించాడు. ధోనీ హెయిర్ స్టైల్ మార్చడంటే అతని ఆట కూడా మారుతుందని అభిమానులు అశిస్తుంటారు. తాజా మ్యాచ్‌లో కూడా ధోనీ ఇరగదీస్తాడనుకుంటే అది జరుగలేదు. కేవలం ఆరు బంతులు ఆడిన ధోనీ ఓ సిక్స్‌ కొట్టి ఔటయ్యాడు. దీంతో అతని న్యూలుక్‌పై అభిమానులు ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ‘గుండు కొట్టించుకున్నా.. ఫలితం మారలేదు’ అంటూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.

Also Read: ఐపీఎల్‌లో ఢిల్లీ జోరు.. టాప్‌ ప్లేస్‌ సాధించిన జట్టు

రాయుడిని సైతం నెటిజన్లు ఓ ఆటఆడేసుకున్నారు. 170 పరుగులు చేధించడానికి మీకు 200బంతులు ఇవ్వాలేమోనని అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక చెన్నై బ్యాటింగ్‌కు విసుగెత్తిపోయిన ఆ జట్టు ట్విటర్ హ్యాండిలే.. వ్యంగ్యాస్త్రాలు సంధించడం గమానర్హం. చెన్నై బ్యాటింగ్ చూస్తుంటే మీరేం అనుకుంటున్నారనీ, బీపీ టాబ్లేట్ లేక, బీ పాజిటీవ్ అని భావిస్తున్నారా? అని క్వశ్చన్ పోల్ పెట్టింది.

ఇందులో బీ పాజిటివ్‌ అని 50.6 శాతం మంది చెప్పగా.. 49.4 శాతం మంది బీపీ టాబ్లేట్ వేసుకోవాలని ఉందన్నాడు. ఇలా చెన్నై వరుస ఓటములపై నెట్టింట్లో ఫన్నీ మిమ్స్ హల్చల్ చేస్తున్నాయి