https://oktelugu.com/

అంబానీకి అదిరిపోయే పంచ్ వేసిన సోనుసూద్..!

లాక్డౌన్ కారణంగా దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ఈ సమయంలో నేనున్న అంటూ ప్రజలకు అండగా నిలిచాడు నటుడు సోనూసుద్. తన సొంత డబ్బులు వెచ్చించి ఎంతోమందిని ఆదుకున్నాడు. Also Read: గోవాలో నిహారిక బ్యాచిలర్ పార్టీ.. చూసి తీరాల్సిందే..! వలస కార్మికులను తమ సొంతూళ్లకు తరలించేందుకు సోనూసుద్ తన సొంత బస్సులను ఏర్పాటు చేశాడు. కొందరినీలో రైళ్లలో తన డబ్బులతో పంపించి రియల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 11, 2020 / 01:58 PM IST
    Follow us on

    లాక్డౌన్ కారణంగా దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ఈ సమయంలో నేనున్న అంటూ ప్రజలకు అండగా నిలిచాడు నటుడు సోనూసుద్. తన సొంత డబ్బులు వెచ్చించి ఎంతోమందిని ఆదుకున్నాడు.

    Also Read: గోవాలో నిహారిక బ్యాచిలర్ పార్టీ.. చూసి తీరాల్సిందే..!

    వలస కార్మికులను తమ సొంతూళ్లకు తరలించేందుకు సోనూసుద్ తన సొంత బస్సులను ఏర్పాటు చేశాడు. కొందరినీలో రైళ్లలో తన డబ్బులతో పంపించి రియల్ హీరో అనిపించాడు. అంతేకాకుండా తన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యను పరిష్కరిస్తూ అతడే మినీ ప్రభుత్వంలా మారిపోయాడు. దీంతో సోనూసుద్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

    తాజాగా సోనూసుద్ సోషల్ మీడియాలో భారత కుబేరుడు అనిల్ అంబానీ గుబాగుయ్ మనేలా అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. అనిల్ అంబానీ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు. అయినప్పటికీ కరోనా సమయంలో పేదల కోసం ఒకపైసా ఇచ్చిన పాపానా పోలేదు. ఈ నేపథ్యంలో సోనూసుద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

    కరోనా సమయంలో అంబానీ ఆస్తులు 22బిలియన్ల మేరకు వృద్ధి ఆయన సంపద 79.3బిలియన్లకు చేరింది. కరోనా టైంలో జియో సంస్థలోకి పెట్టుబడులు వరదలా వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలోనే సోనూ సూద్ అంబానీ లాంటి కుబేరులకు గట్టిగా తగిలేలా ట్విట్టర్లో పంచ్ వేశాడు. కరోనా.. లాక్డౌన్ సమయంలో ధనవంతులు మరింత ధనవంతులుగా మారారని.. పేదవాళ్లు మరింత పేదవాళ్లు అయ్యారని సోనూసుద్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. దీనికి నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది.

    Also Read: దిశ’ మూవీ కూడా ‘మర్డర్’ అవుతుందా?

    కరోనా టైంలో కేంద్రం తీసుకొచ్చిన పాలసీలు పేదల కంటే కార్పొరేట్ కంపెనీలకే మేలు చేశాయనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ తరుణంలో సోనూసుద్ ట్వీట్ మరోసారి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను తెరపైకి తీసుకొచ్చింది. కరోనా సమయంలో కేంద్రం తీసుకొచ్చిన వేలకోట్ల ఉద్దీపాన ప్యాకేజీతో పేదలకు ఒరిగిందేమీ లేదని అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.