బస్సును ఢీకొట్టిన రైలు.. 17 మంది మృతి..

బస్సును రైలు ఢీకొట్టిన సంఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన థాయ్‌లాండ్‌ దేశంలో చోటు చేసుకుంది. చోంగ్‌సావో ప్రావిన్స్‌లోని ఓ ఆలయంలో బౌద్ధ ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరయ్యేందుకు బ్యాంకాక్‌ నుంచి భక్తులు ఈ బస్సులో వెళ్తున్నారు. మార్గమధ్యలోని ఓ రైల్వేలైన్‌పైకి బస్సు రాగానే రైలు ఢీకొట్టింది. దీంతో బస్సు రైల్వే ట్రాక్‌పై పడి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడే మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరో 29 మంది […]

Written By: Suresh, Updated On : October 11, 2020 1:50 pm
Follow us on

బస్సును రైలు ఢీకొట్టిన సంఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన థాయ్‌లాండ్‌ దేశంలో చోటు చేసుకుంది. చోంగ్‌సావో ప్రావిన్స్‌లోని ఓ ఆలయంలో బౌద్ధ ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరయ్యేందుకు బ్యాంకాక్‌ నుంచి భక్తులు ఈ బస్సులో వెళ్తున్నారు. మార్గమధ్యలోని ఓ రైల్వేలైన్‌పైకి బస్సు రాగానే రైలు ఢీకొట్టింది. దీంతో బస్సు రైల్వే ట్రాక్‌పై పడి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడే మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరో 29 మంది గాయపడడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే థాయ్‌లాండ్‌ ఇలాంటి ప్రమాదాలు కొత్తేమీ కాదు.. 2018 సంవత్సరం మార్చిలోనూ ఇలాంటి ప్రమాదం జరిగింది. ఈశాన్య థాయిలాండ్‌లోనూ రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పుడు 18 మంది మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. మరోవైపు అత్యధిక రోడ్డు ప్రమాదాల మరణాలు సంభవించే దేశాల్లో థాయిలాండ్‌ రెండో స్థానంలో ఉంది.